ఆంధ్రప్రదేశ్‌

గ్రామకంఠాల్లో ఇళ్లు, స్థలాల్ని విలీనం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 15: రాజధాని అమరావతి ప్రతిపాదిత ప్రాంతంలో ఉండవల్లి, పెనుమాక గ్రామాలు విస్తరించిన దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం గ్రామకంఠాల పరిధి పెంచాలంటూ ఆ గ్రామాల రైతులు సోమవారం వినతిపత్రం అందజేశారు. తుళ్లూరు సిఆర్‌డిఎ ప్రాంతీయ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్‌లో పలువురు తమ వినతిపత్రాలను అధికారులకు అందించారు. సిఆర్‌డిఎ అధికారులు గ్రామకంఠాల విస్తీర్ణం పెంచాలంటూ ఇప్పటికే అనేకసార్లు కోరామన్నారు. గతంలో సిఆర్‌డిఎ అధికారులకు 9.2 ద్వారా అభ్యంతరాలు వ్యక్తం చేశామన్నారు. అంతేకాకుండా గ్రామకంఠాల పరిధిని పెంచాలంటూ మంత్రులు, సిఆర్‌డిఎ అధికారులకు తమ సమస్యలను విన్నవించామన్నారు. విజయవాడ - అమరావతి ప్రధాన రహదారికి పక్కనే ఉన్న ఇళ్లు, స్థలాలను గ్రామకంఠంలో కలపకుండా మినహాయించటాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. సుమారు 20 ఏళ్లుగా ఇంటిపన్ను కడుతున్న రశీదులను కూడా అధికారులకు చూపించామన్నారు.