అంతర్జాతీయం

గ్రహాంతర జీవులు లేనట్టేనా?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్‌బోర్న్, జనవరి 22: ఈ భూమి మీదే కాకుండా ఇతర గ్రహాల్లోనూ గ్రహాంతర జీవులున్నాయన్న కథనాలు అడపాదడపా వినిపిస్తునే ఉంటాయి, వీటి గురించి చెప్పుకోవడమే తప్ప వీటి ఉనికి ఎంత వరకు నిజం.. అసలు ఉన్నాయా? లేదా అన్నది దశాబ్దాలుగా మిస్టరీగానే కొనసాగుతోంది. ఈనేపథ్యంలో ఈ గ్రహాంతర జీవుల మిస్టరీని ఛేదించామని శాస్తవ్రేత్తల బృందం స్పష్టం చేసింది. ఇంతగా పరిశోధనలు చేస్తున్నా గ్రహాంతర జీవుల గురించి తెలియలేదంటే అవి అసలు లేనట్టే లెక్కని తేల్చిచెప్పింది. ఇతర గ్రహ వాతావరణం జీవజాతుల మనుగడకు ఎంతమాత్రం అనకూలమైనది కాబట్టి ఒకవేళ ఇలాంటి జీవులున్నా అవి వెంటనే అంతమైపోతాయని భారతీయ సంతతికి చెందిన శాస్తవ్రేత్తకూడా కలిగిన ఈ బృందం వెల్లడించింది. అసలు జీవజాతులు ఏ విధంగా అంకురిస్తాయన్న ప్రాధమిక అంశాన్ని ప్రాతిపదికగా చేసుకునిన గ్రహాంతర జాతులపై పరిశోధన జరిపారు. ఈ విశ్వంలో ఆవాసయోగ్యమైన ఎన్నో గ్రహాలున్నాయని భావిస్తున్న కొందరు శాస్తవ్రేత్తలు ఈ అనుకూల వాతావరణంలో గ్రహాంతర జీవులు ఉన్నాయన్న ఓ వాదనను వ్యాపింప చేశారని ఆస్ట్రేలియా జాతీయ వర్శిటీకి చెందిన డాక్టర్ ఆదిత్య చోప్రా పేర్కొన్నారు. 4 బిలియన్ సంవత్సరాల క్రితం భూమి, అంగారక, శుక్ర గ్రహ వాతావరణాలు జీవానుకూలతను కలిగి ఉండేవని అయితే అనంతరం జరిగిన మరో బిలియన్ సంవత్సరాల కాలంలో శుక్ర గ్రహం అత్యంత ఉష్ణమండలంగా మారిపోయిందని, అలాగే అంగారక గ్రహం మంచుగడ్డ చందంగా మారిపోయిందన్నారు. ఇలాంటి వాతావరణంలో తొలి సూక్ష్మజాతులు(మైక్రోవ్‌లు) శుక్ర, అంగారక గ్రహాలు ఆవిర్భవించాయిన భావించినా చాలా వేగంగా మారిన ఉష్ణోగ్రతలు అంతరించిపోయి ఉండొచ్చని ప్రొఫెసర్ చార్లీ, లయనే వీవర్ అనే శాస్తవ్రేత్తలు తెలిపారు.