ఆంధ్రప్రదేశ్‌

కాసులు కురిపిస్తున్న గాలిమరలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి టవర్‌కూ మామూళ్లు
అనంతపురంలో అధికార పార్టీ నేతలకు వరం
ఇబ్బందిపడుతున్న కంపెనీలు

అనంతపురం, డిసెంబర్ 3: అనంతపురం జిల్లా వాతావరణ పరిస్థితులు గాలిమరల ఏర్పాటుకు అనుకూలం కావడంతో కంపెనీలు క్యూ కడుతున్నాయి. రాష్టవ్య్రాప్తంగా గాలిమరల ద్వారా 2179 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అనుమతులు మంజూరు చేశారు. ఇందులో ఒక్క అనంతపురం జిల్లాలోనే 1300 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అనుమతులు మంజూరు చేయడం గమనార్హం. అయితే ఇదే అధికార పార్టీ నాయకులకు పెద్దవరంగా మారి కాసులు కురిపిస్తోంది. స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు తమ ప్రాంతంలో గాలిమరలు ఏర్పాటు చేయాలంటే ఎంతోకొంత ముట్టచెప్పాలని కంపెనీలను బెదిరిస్తున్నారు. వీరు అడిగినంత డబ్బు చెల్లించకుంటే గాలిమరల కంపెనీల పని ముందుకు సాగదు. దీంతో చేసేదిలేక గాలిమరలు ఏర్పాటు చేయబోయే కంపెనీలు ముందుగా స్థానిక నాయకులను ప్రసన్నం చేసుకున్న తరువాతే పనిలోకి దిగుతున్నాయి. దీంతో జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన, చేయనున్న గాలిమరల పుణ్యమా అని కోట్లాది రూపాయలు అప్పనంగా నాయకుల జేబుల్లోకి వచ్చి పడుతున్నాయి. ఇది చూసిన మిగతా నియోజకవర్గాల్లోని నాయకులు తమ ప్రాంతానికి గాలిమరలు వస్తే బాగుండునని కోరుకుంటున్నారు. ఒక్కో గాలిమర ఏర్పాటుకు వారి వారి స్థాయిలను బట్టి రూ. 3 నుంచి రూ. పది లక్షల వరకూ నాయకులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనంతపురం జిల్లాలోని తల్లికొండ, నల్లకొండ, బోరంపల్లి, వజ్రకరూరు, తాలిరి చెరువు తదితర ప్రాంతాల్లో కొత్తగా గాలిమరలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు అవసరమైన భూ సేకరణ కొనసాగుతోంది. ఒక్కో గాలిమర ఏర్పాటుకు మూడు ఎకరాల వరకూ భూ సేకరణ చేయాల్సి ఉంటుంది. కొన్ని చోట్ల ఇప్పటికే భూ సేకరణ పూర్తయ్యి గాలిమరల ఏర్పాటు కూడా పూర్తయ్యింది.
అయితే స్థానిక నాయకులు డబ్బు విషయంలో కొండెక్కి దిగిరామనడంతో కంపెనీలు పునరాలోచనలో పడ్డాయి. డబ్బు మరీ ఎక్కువ అడుగుతున్న నేతలు ఉండే ప్రాంతాల్లో గాలిమరలు ఏర్పాటుచేయకుండా మరోచోటికి తరలించుకుపోతున్నారు. గాలిమరల ఏర్పాటు వల్ల స్థానికంగా కొంతమందికి ఉపాధి లభించనుంది. అయితే నేతల వ్యవహారం వల్ల కంపెనీలు వెనక్కి వెళ్తుండడంతో నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కాగా ఈ అనుభవాలతో కొత్త కంపెనీలు జిల్లాలో గాలిమరల ఏర్పాటుకు మందుకురావడం లేదు.