ఆంధ్రప్రదేశ్‌

బాబు ఆహ్వానిస్తే టిడిపిలో చేరతా: గాదె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఆహ్వానిస్తే తాను టిడిపిలో చేరడానికి సుముఖంగా ఉన్నానని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం బాపట్లలో విలేఖరులతో మాట్లాడుతూ, టిడిపిలో బేషరతుగా చేరేందుకు తాను సిద్ధమేనని ప్రకటించారు. కాగా, రాజధాని ప్రాంతంలో ఎవరు భూములు కొనుక్కున్నా తప్పులేదన్నారు. టిడిపి నేతలు భూములు కొన్నారని గగ్గోలు పెడుతున్న వారే అందుకు ఆధారాలు చూపాలి తప్ప, పత్రికల్లో విమర్శలు చేసుకోవడం సరికాదన్నారు. తగిన సాక్ష్యాలుంటే సిబిఐ చేత విచారణ చేయించేలా ఒత్తిడి తేవాలన్నారు. ఎపి రాజధాని ప్రాంతంలో అన్ని పార్టీల నేతలు, వారి అనుచరులు భూములు కొన్నారని ఆయన తెలిపారు.