తెలంగాణ

గద్వాల జిల్లా సాధిద్దాం: డికె అరుణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, డిసెంబర్ 3: పాలమూరు జిల్లాకు సాగు, తాగునీటిని అందించేందుకు నడిగడ్డ ప్రాంతం ఎన్నో త్యాగాలకు పూనుకుందని, ఇలాంటి త్యాగాల నడిగడ్డను విస్మరిస్తే చూస్తూ ఊరుకోమని మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల ఎమ్మెల్యే, మాజీ మంత్రి డికె అరుణ హెచ్చరించారు. గద్వాల జిల్లా సాధన కోసం ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని గద్వాల నియోజకవర్గంలో గురువారం చేపట్టారు. నియోజకవర్గంలోని 150 గ్రామాల్లో నిరాహార దీక్షలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గద్వాల జిల్లా సాధన సమితి పర్యవేక్షణలో దీక్షలు విజయవంతమయ్యాయి. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాలను సందర్శించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ సాగు, తాగునీటి ప్రాజెక్టుల కోసం ఈ ప్రాంత రైతాంగం భూములు, ఇళ్లు, గ్రామాలు కోల్పోయి త్యాగాలు చేశారని, అభివృద్ధికి నోచుకోని నడిగడ్డ ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి వారి రుణం తీర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసే జిల్లా కేంద్రాలకు అవసరమైన అన్ని వౌలిక సదుపాయాలు, ప్రభుత్వ భూమి, తాగునీరు, కార్యాలయాల, రోడ్ల సౌకర్యం, రైల్వే సౌకర్యం...్భగోళికంగా అన్ని అర్హతలు గద్వాలకు ఉన్నాయని గుర్తు చేశారు. భాషాప్రయుక్త రాష్ట్రాల విభజన సందర్భంగా కర్ణాటక నుండి నడిగడ్డ ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌లో కలిపారని, ఆ సందర్భంగా బచావత్ ట్రిబ్యునల్ కింద జూరాల ప్రాజెక్టును మంజూరు చేశారని, జూరాలతో నడిగడ్డ ప్రాంతం ముంపునకు గురై రైతుల త్యాగాలతో జిల్లా మొత్తం సస్యశ్యామలం అవుతోందన్నారు. ఈ ప్రాంత ప్రజలకు సరైన న్యాయం జరగాలంటే జిల్లా ఏర్పాటే శరణ్యమని ఆమె గుర్తు చేశారు. యువకులు, విద్యావంతులు అన్ని వర్గాల ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో గద్వాల జిల్లా ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఉద్యమనేతగా చె ప్పుకుంటున్న ముఖ్యమంత్రి కెసిఆర్‌కు గద్వాల జిల్లా ఉద్యమ సెగ చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలకు పిలుపునిచ్చారు. రెండు రోజుల వ్యవధిలో జిల్లా కోసం ఆకాంక్ష కలిగిన ఈ ప్రాంత ప్రజలు గ్రామగ్రామాన నిరాహార దీక్షలకు పూనుకోవడం అభినందనీయమని, వారి త్యాగాలను వృథా పోనివ్వమని భరోసా ఇచ్చారు. త్వరలోనే అలంపూర్, ఆత్మకూర్, మక్తల్ ప్రాంతాలను కలుపుకుని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆమె హెచ్చరించారు. రెండు రోజుల్లో గద్వాల డివిజన్ కేంద్రంలో నిరంతరం రిలే నిరాహార దీక్షల కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు.