రాష్ట్రీయం

నేరగాళ్లతో సంబంధాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైకాపాపై ధ్వజమెత్తిన టిడిపి నాయకురాలు అనురాధ
ఆంధ్రాపై కవితకు ఎందుకు అంత అక్కసు: గాలి
హైదరాబాద్, నవంబర్ 23: నేరగాళ్లతో వైకాపా అనైతిక బంధాలను మొసలి కన్నీళ్లతో కప్పిపుచ్చలేరని టిడిటి అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు. సోమవారం నాడు ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ సిఎం చంద్రబాబునాయుడు, మంత్రులు, అధికార యంత్రాంగం రాత్రీ పగలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో తలమునకలై ఉన్నారని, అయితే సహాయ కార్యక్రమాలకు దూరంగా ఉన్న విపక్షనేత మొసలి కన్నీరు కారుస్తున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రభుత్వంపైన అభాండాలు వేస్తే గంగిరెడ్డి లాంటి నేరగాళ్లతో తన సంబంధాలపై ప్రజల్లో జరుగుతున్న చర్చలను కప్పిపుచ్చుకోవచ్చని జగన్ తంటాలు పడుతున్నారని అన్నారు. కడప చిత్తూరు జిల్లాల్లో పనిచేసిన రెవిన్యూ, అటవీ, పోలీసు అధికారులు, ఉద్యోగులు కూడా గంగిరెడ్డిని చూసి గడగడలాడుతున్నారని అన్నారు. గాలి జనార్ధనరెడ్డి వ్యవహారంలో ఐఎఎస్‌లు, జడ్జీలు జైలుపాలైన వాస్తవం గుర్తుకువస్తోందని అన్నారు. ఒక చానల్ పనిగట్టుకుని గంగిరెడ్డి భార్య ఇంటర్వ్యూలు ప్రసారం చేయడం వారి సంబంధాలను వెల్లడిస్తోందని పేర్కొన్నారు. ఆంధ్రాపై టిఆర్‌ఎస్ ఎంపి కవిత అక్కసు వెళ్లగక్కడం దురదృష్టకరమని, ఆంధ్రాపై అంత అక్కసు ఎందుకని ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు ప్రశ్నించారు. కవిత తీరును తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. కేంద్రం ఎపికి ఏదో దోచిపెడుతోందన్నట్టు మాట్లాడటం సరికాదని, ఎపి లోటు బడ్జెట్ కూడా భర్తీ చేయాలేదని , మంత్రి పదవి దక్కే అవకాశం లేదనే కవిత ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఆంధ్రా పేరు చెప్పనిదే ఆమె బతకలేరా అని ప్రశ్నించారు. ఆనం సోదరుల చేరికపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకుంటారని అన్నారు. రోమ్‌నగరం తగలబడుతుంటే పిడేలు వాయించినట్టుగా జగన్ తీరు ఉందని ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు ధ్వజమెత్తారు. భారీ వర్షాలతో కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు అతలాకుతలమవుతుంటే వైకాపా నేతలు పరామర్శించాల్సింది పోయి విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ముంపు ప్రాంతాల్లో ప్రజల బాగోగులు చూడాల్సిన విపక్ష నేతలు హైదరాబాద్‌లో కూర్చుని రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.