రాష్ట్రీయం

మరో రూ.45 కోట్లు గల్లంతు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలిక్కిరాని ఎస్‌బిహెచ్ స్కాం?
కొనసాగుతున్న సిబిఐ విచారణ
మరో రెండు సంస్థల ఫిర్యాదు
ఏపి స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్‌లో రూ. 37 కోట్లు
పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో రూ. 8కోట్లు మళ్లింపు
================
హైదరాబాద్, డిసెంబర్ 26: స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, మరికొన్ని బ్యాంకుల్లో ఇటీవల జరిగిన ఖాతాల్లోని నిధుల మళ్లింపు కుంభకోణం ఇంకా ఒక కొలిక్కిరాలేదు. ఈ కేసులో కీలక సూత్రధారి మణి దామోదర్ దొరికే వరకు డిపాజిట్ల గల్లంతుపై విచారణ నత్తనడకనే సాగుతుందని విమర్శ వినవస్తుంది. సిబిఐ విచారణ వేగవంతం చేస్తే గానీ అసలు దోషులెవరు..ఎంత మేరకు డిపాజిట్లు గల్లంతయ్యాయన్న విషయం బయటపడుతుందని ఓ సీనియర్ విచారణ అధికారి తెలిపారు. ఎస్‌బిహెచ్ మల్కాజ్‌గిరితోశాఖతోపాటు ఘట్‌కేసర్, ఖమ్మం ఎస్‌బిఐ బ్యాంకుల్లో జరిగిన కుంభకోణంపై సిబిఐ దర్యాప్తు చేపట్టిన నేపథ్యంలో మరో రెండు ప్రభుత్వ రంగం సంస్థలు ఫిర్యాదు చేశాయి. ఎస్‌బిహెచ్ మల్కాజ్‌గిరి శాఖలో రూ. 8.47కోట్లు, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖమ్మం బ్రాంచిలో రూ. 7.67కోట్లు మళ్లింపుపై తెలంగాణ సిఐడి దర్యాప్తు చేస్తుండగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్‌కు చెందిన రూ. 37కోట్లు, ఏపి పొల్యుషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించి రూ. 8కోట్లు ఖాతాల మళ్లింపుపై ఫిర్యాదులు వచ్చాయి. ఎస్‌బిహెచ్ సింగపూర్ టౌన్‌షిప్, ఘట్‌కేసర్, ఎస్‌బిహెచ్ మెహిదీపట్నం శాఖలలో జరిగిన కుంభకోణంపై ఏపి సిఐడి విచారణ జరుపుతోంది. అదేవిధంగా సదరు సంస్థల డిపాజిట్లు నగరంలోని ఎస్‌బిహెచ్‌తోపాటు రాజంపేట, కడప, తిరుపతి బ్రాంచిల్లో కూడా బదిలీ జరిగాయని సిఐడి అధికారులు చెబుతున్నారు. ఈ కేసులో పూర్తిస్థాయి విచారణకు ఇటీవల హైకోర్టు సిబిఐకి బాధ్యతలు ఇచ్చింది.
దీంతో హైదరాబాద్‌లోని సిబిఐ అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. సిబిఐ, సిఐడి విభాగాలకు చెందిన అధికారులు ఎస్‌బిహెచ్ కుంభకోణంపై దర్యాప్తు చేస్తుండగా ఎస్‌బిహెచ్ ఎకనామిక్ అఫెనె్సస్ వింగ్ (చెన్నై)కు కూడా ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఇఓడబ్ల్యు బ్యాంకులోని డిపాజిట్లపై విచారణ జరుపుతోంది. ఈ కేసులో రెండు ప్రభుత్వరంగ సంస్థలతోపాటు ఎపి లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ కూడా ఒకటని, ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి మణి దామోదర్‌ను పోలీసులు ఇప్పటి వరకు పట్టుకోలేకపోయారని, ఎవరినీ అరెస్టు చేయలేదని సిబిఐ తెలిపింది. అదేవిధంగా సిఐడి నుంచి తమకు బదిలీ చేసిన కేసుపై విచారణ కొనసాగుతుందని సిబిఐ పేర్కొంది.