కడప

గండికోటపై సర్వే నివేదిక కోరిన కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, డిసెంబర్ 22: గండికోటను ప్రపంచస్థాయి పర్యాటక రంగంగా తీర్చిదిద్దాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ కెవి రమణ మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో సమావేశమై సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లా పర్యాటకాభివృద్ధి అధికారి జి.గోపాల్, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అధికారి బాలకృష్ణారెడ్డి, టూరిజం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టూరిజం సర్క్యూట్‌గా జిల్లాలోని ఒంటిమిట్ట, గండికోట , సిద్దవటం, బ్రహ్మంగారిమఠం ప్రాంతాలను కలుపుతూ ప్యాకేజి టూర్‌ను ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ మేరకు వాటికి సంబంధించిన మ్యాప్‌లు, సర్వేలు, పూర్తి వివరాలతో నివేదికలు అందించాలని ఆయన కోరారు. లఘు చిత్రం నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఒంటిమిట్ట చెరువులో సందర్శకుల నిమిత్తం బోటింగ్ సౌకర్యం కల్పించేందుకు ఏపి టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రతిపాదనలు తయారు చేయాలని కలెక్టర్ కోరారు. జిల్లాలో టూరిజం ప్రమోషన్ కమిటీ సమర్థవంతంగా పనిచేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో జెసి శే్వత టియోటియ, టూరిజం అధికారి జి.గోపాల్, డిఆర్‌డిఏ, డ్వామా పిడిలు అనిల్‌కుమార్‌రెడ్డి, బాలసుబ్రమణ్యం, పంచాయతీరాజ్ ఎస్‌ఇ నాగేశ్వరరావు, దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శంకర్‌బాలాజి, పురావస్తుశాఖ అధికారి గంగాధర్, టూరిజం డెవలప్‌మెంట్ మేనేజర్ గిరిప్రసాద్‌రెడ్డి, చాంబర్స్ ఆఫ్ కామర్స్ రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.