రాష్ట్రీయం

గంగిరెడ్డి భార్య పిటిషన్‌ను విచారించిన హైకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

24లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయండి
ఏపి హోంశాఖకు ఆదేశం
హైదరాబాద్, మార్చి 12: ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటూ జైలులో ఉన్న కె గంగిరెడ్డి కేసులో ఆంధ్రప్రదేశ్ హోంశాఖ ఈ నెల 24వ తేదీలోగా కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తన భర్త ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెంది గంగిరెడ్డి భార్య దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. తన భర్తను కడప జైలులో ఏకాంత కారాగారవాసంలో ఉంచారని, కనీస వౌలిక సదుపాయాలు కల్పించలేదని, ఇతర విచారణ ఖైదీలతో సమానంగా తన భర్తను చూడాలని ఆమె కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు.
గంగిరెడ్డి భార్య మాళవిక తరఫున న్యాయవాది వి రఘునాథ్ వాదనలు వినిపిస్తూ గంగిరెడ్డి మానసిక మాంద్యానికి లోనవుతున్నారని, జైలులో అమానవీయంగా గంగిరెడ్డి పట్ల జైలు అధికారులు ప్రవర్తిస్తున్నారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.