కృష్ణ

సామాజిక స్పృహలేని వారే నిజమైన వికలాంగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* వికలాంగుల దినోత్సవ సభలో మంత్రి గంటా
విజయవాడ, డిసెంబర్ 3: గుణం తక్కువ, సామాజిక స్పృహ లేని వ్యక్తులే నిజమైన వికలాంగులని మనోధైర్యంతో ముందుకు వెళుతున్న విభిన్న ప్రతిభావంతులు అందరికీ ఆదర్శప్రాయులని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. స్థానిక బిషప్ గ్రాసి ఉన్నత పాఠశాల ఆవరణలో రాష్ట్ర సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన అంతర్జాతీయ వికలాంగుల వేడుకల దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆశావహ దృక్పథంతో ముందడుగు వేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుని అడుగులు వేసినప్పుడే ఉన్నత శిఖరాలను చేరుకోగలుగుతామన్నారు. సమస్యలు ప్రతి ఒక్కరికీ ఉంటాయని వాటి నుండి పాఠాలు నేర్చుకుని ముందుకు వెళ్లేవాళ్లు విజయం సాధిస్తారని అందుకు ఐఎఫ్‌ఎస్ సర్వీస్‌కు ఎంపికైన శ్రీనివాసరెడ్డి నిదర్శనం అన్నారు. అంగవైకల్యం ఉన్నా నిస్పృహకు లోనవకుండా నలుగురికీ ఆదర్శంగా నిలిచిన వ్యక్తులను సన్మానించడం ఎంతో ఆనందంగా ఉందని మంత్రి అన్నారు. వైద్యులు డాక్టర్ రమేష్, రాష్టప్రతి అవార్డు అందుకున్న కామిశెట్టి వెంకట్, గిన్నీస్ రికార్డు సాధించిన కోరుకొండ రంగారావు, వ్యాపారవేత్త జెమ్స్, మానసిక విశే్లషకులు టిఎస్ రావు సేవారంగంలో పనిచేస్తున్న డాక్టర్ పి.సరస్వతిదేవి తదితరులు స్ఫూర్తివంతులన్నారు. ప్రభుత్వం ఇకపై వికలాంగులను విభిన్న ప్రతిభావంతులుగా పిలవడంతో గుర్తించడం జరుగుతుందన్నారు. వీరి సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందని గతంలో ఈ వేడుకను నామమాత్రంగా జరిపేవారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సంకల్పంతో రాష్టస్థ్రాయిలో రెండు వేడుకలు మరియు జిల్లా స్థాయిలో నిర్వహించడం జరుగుతోందన్నారు. అనంతరం విశిష్ట ప్రతిభను కనపరిచిన మానసిక, శారీరక అంగవైకల్యానికి గురైనా ఆత్మవిశ్వాసంతో విభిన్న ప్రతితావంతులుగా గుర్తింపబడిన వ్యక్తులను సన్మానించారు. వారిలోని ప్రతిభను తెలియజేయడానికి కృషిచేసిన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, సమాజంలోని వ్యక్తులకు, సంస్థలకు మంత్రి శ్రీనివాసరావు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
రూ.20.05 కోట్లతో ప్రత్యేక అవసరాలు ఉన్న బాలల పథకం
ప్రత్యేక అవసరాలున్న బాలల పథకంలో భాగంగా విద్య చేకూర్పు అందించేందుకు 55వేల 185 మంది లబ్ధిదారులను గుర్తించి 20 కోట్ల 5 లక్షల మేర ఉపకరణాలు పంపిణీ చేశారు. 671 మందికి ఉపకరణాల పంపిణీ, 671 మందికి వినికిడి తర్ఫీదు, 14వేల 935 మందికి 10 నెలలకు రవాణా భత్యం, 671 మందికి చైల్డ్‌కేర్ ఉపకార వేతనాలు, 10వేల 550 మందికి ఐసిటి పరికరాలు, 3002 మందికి చిన్నపాటి శస్తచ్రికిత్సలు, 12338 మందికి సహాయకుని భత్యము, 671 మందికి వరల్డ్ డిసబుల్ డే సందర్భంగా పురస్కారం, 9623 మందికి గురుకుల శిక్షణా కార్యక్రమం, మండల స్థాయి పోటీలు తదితర కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి ఆర్‌పి సిసోడియా, సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు డైరక్టర్ డా.విబి రమణమూర్తి, బిషప్ గ్రాసి కరస్పాండెంట్ జానెస్, ఇతర జిల్లా స్థాయి అధికారులు 13 జిల్లాల నుంచి వచ్చిన విశిష్ట ప్రతిభావంతులు, స్వచ్ఛంద సంస్థ ప్రతిభావంతులు హాజరయ్యారు. ఈ సందర్భంలో రాష్ట్రంలో గెలుపు కిరణాలు దిశగా పయనిస్తున్న వందమంది అంగవైకల్యం కలిగిన వ్యక్తుల విజయగాథల పుస్తకాన్ని ఆవిష్కరించారు. రెండు రోజులుగా జరిగిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. ప్రాంగణంలో 50 స్టాల్స్ ఏర్పాటు కాగా విజ్ఞాన వినోదాత్మక సైన్స్ పరికరాలు, వికలాంగులు తయారుచేసిన అద్భుతాలు ప్రధానంగా పుస్తకాల ప్రదర్శన మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పలువురు పుస్తకాలను ఆసక్తిగా పరిశీలించారు.