రాష్ట్రీయం

లండన్‌లో ఏపి కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి గంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 13: లండన్‌లో ఆంధ్రప్రదేశ్ తరపున అమరావతి కార్యాలయాన్ని రాష్ట్ర మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదివారం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌లో బ్రిటన్‌కు చెందిన పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ కార్యాలయం కీలక భూమికను పోషించనుంది. పారిశ్రామిక వేత్తలకు, ప్రభుత్వానికి మధ్య చర్చలకు, నిర్ణయాలకు పరిపాలనా పరమైన ఇబ్బందులు లేకుండా చూడాలని కొంత మంది పారిశ్రామికవేత్తలు చేసిన సూచన మేరకు లండన్‌లో ఆంధ్రా-అమరావతి కార్యాలయాన్ని నెలకొల్పుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ కార్యాలయం నిర్వహణ బాధ్యతను ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. బోర్డు సిఇఓ జె.కృష్ణ కిశోర్ పారిశ్రామికవేత్తలతో, పెట్టుబడిదారులతో అనునిత్యం కాంటాక్ట్‌లో ఉంటారని సిఎం పేర్కొన్నారు. ఆదివారం నాటి కార్యక్రమంలో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్ పి వి రమేష్, ఎంపి సిఎం రమేష్, డాక్టర్ రవికుమార్ వేమూరు, విజయ్ గోయల్, ఆర్‌విఆర్ చౌదరి, అమర్ కవి, నర్సింహరావు, నిరంజన్ మోటూరి పాల్గొన్నారు. (చిత్రం) లండన్‌లో ఏపి కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావు