ఆంధ్రప్రదేశ్‌

విభజనతో తెలంగాణకు ఆస్తులు, ఎపికి అప్పులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప: రాష్ట్ర విభజన ఫలితంగా తెలంగాణకు ఆస్తులు, ఎపికి అప్పులు మిగిలాయని, అయినప్పటికీ కష్టాలను ఎదుర్కొని అభివృద్ధి పథంలో పయనించేలా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఇక్కడ బుధవారం సాయంత్రం మహాసంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ, విభజన వల్ల జరిగిన నష్టాలను మననం చేసుకుంటూ ముందుకు సాగాలన్న ఉద్దేశంతోనే వారం రోజుల పాటు ప్రభుత్వం నవ నిర్మాణ దీక్షను, చివరి రోజున మహాసంకల్ప సభను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సహజ వనరులను సద్వినియోగం చేసుకుంటే ఎపికి ఎదురులేదన్నారు. కాగా, ఒక అసమర్థుడు అసెంబ్లీలో విపక్ష నేతగా ఉండడం రాష్ట్ర ప్రజల దురదృష్టమని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయ దురుద్దేశంతో అభివృద్ధికి అడ్డుతగిలేవారిని ప్రజలు క్షమించరన్నారు.