రాష్ట్రీయం

ప్రకాశం జిల్లాను వీడని వానలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొంగుతున్న మనే్నరు, నల్లవాగు * రాళ్ళపాడు ప్రాజెక్టు ఐదుగేట్ల ఎత్తివేత
ఒంగోలు, నవంబర్ 21:బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లావ్యాప్తంగా నాలుగురోజులనుండి ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురవటంతో వివిధ రంగాలకు 8.19కోట్లరూపాయల నష్టం వాటిల్లింది. ఈమేరకు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. వ్యవసాయశాఖకు 2.37కోట్లరూపాయల నష్టం జరగ్గా కేవలం కనిగిరి డివిజన్‌ప్రాంతంలోకోతకు వచ్చిన వెయ్యి హెక్టార్ల మినుము, పెసర పంటకు మొలకలు రావటంతో రైతులు భారీగా నష్టపోయారు. జిల్లావ్యాప్తంగా పొగాకుకు ప్రత్యామ్నాయంగా సాగుచేసిన శనగ మొలకకూడా దెబ్బతింది. జిల్లాలోని కొన్నిప్రాంతాల్లో కోతకు వచ్చిన వరిపంటకూడా దెబ్బతినటంతో రైతులు ఆర్ధికంగా నష్టపోయారు. ఒంగోలు మునిసిపాలిటీలో రోడ్లు, కాల్వలకు దెబ్బతినటంతో ఐదుకోట్లు రూపాయలు, ఇతర శాఖలకు 90లక్షల రూపాయల నష్టం జరిగింది. ముఖ్యంగా జిల్లాలోని కొత్తపట్నం, గుడ్లూరు మండలాల్లోని మత్స్యకారులకు 32లక్షల రూపాయల విలువైన ఐదుబోట్లు, 60వలలు, ఎనిమిది ఇంజన్లు దెబ్బతినటంతో 32లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. గతనాలుగురోజులనుండి మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళకపోవటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా 951 ఇరిగేషన్ చెరువులు ఉండగా 309చెరువులు నిండిపోయాయి. రాళ్ళపాడు ప్రాజెక్టుకు అత్యధింగా వరదనీరు చేరటంతో ఐదుగేట్లను ఎత్తివేసి మనే్నరువాగుకు తరలించారు. ఉలవపాడు - ఆత్మకూరు గ్రామాల మధ్య మనే్నరువాగు, ఒంగోలు -కొత్తపట్నం మధ్య నల్లవాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా నెలసరి సరాసరి వర్షపాతం 143.7మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావాల్సిఉండగా 178.9మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో అత్యధింగా లింగసముద్రం మండలంలో 52సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా జిల్లా ఇన్‌చార్జి మంత్రి రావెల కిశోర్‌బాబు జిల్లా అధికారులతో శనివారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించి ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.