మహబూబ్‌నగర్

అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల్లో 71శాతం పోలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఈవిఎంలో దాగి ఉన్న 57మంది అభ్యర్థుల భవితవ్యం
* 9న ఫలితాలు వెల్లడి
* తెరాసదే పై చేయ * ఐక్య కూటమి గట్టిపొటీ
మహబూబ్‌నగర్, మార్చి 6: జిల్లాలోని అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. అచ్చంపేట పట్టణ ఓటర్లు ఈ ఎన్నికల్లో ఎన్నడూ లేనివిధంగా ఉత్సాహంతో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో ఓటర్ల నుండి భారీ స్పందన లభించింది. 71శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అచ్చంపేట నగర పంచాయతీలో 20వార్డులకు జరిగిన పోలింగ్‌లో 18600మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉండగా 13193మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 20వార్డులకు 20బూతులను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికలు ఈవిఎం ద్వారా నిర్వహించారు. నల్లమల్ల అటవి ప్రాంతంలో గల అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ జరిగిన నేపథ్యంలో దాదాపు 400మందికి పైగా పోలీసులను బందోబస్తు నిమిత్తం ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144సెక్షన్‌ను విధించారు. 57మంది అభ్యర్థులలో 20వార్డులలో పోటీ పడ్డారు. వీరి భవితవ్యం ఈ నెల 9వ తేదిన ఓట్ల లెక్కింపులో తేలనుంది. అచ్చంపేట ఎమ్మార్సీ భవనంలో గట్టీ పోలీస్ బందోబస్తు మధ్య 20వార్డులకు సంబంధించిన ఈవిఎంలను భద్రపర్చారు. ఎన్నికల పరిశీలకుల ఆధీనంలో ఈవిఎంలను భద్రపరిచి ఈవిఎం స్ట్రాంగ్ రూంలకు సీజ్ చేశారు. ఈవిఎం స్ట్రాంగ్ రూంతోపాటు చుట్టు పక్కల 144సెక్షన్‌ను విధించారు. ఆప్రాంతనంతా పోలీస్ ఆధీనంలోకి తీసుకున్నారు. అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల్లో అధికార టిఆర్‌ఎస్ పార్టీ 20వార్డులకు ఒంటరిగా పోటీ చేసింది. అన్ని వార్డులలో తమ పార్టీ అభ్యర్థులను బరిలో దింపారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా రాజకీయ సమీకరణాలలో భాగంగా సిద్దాందాలు, జెండాలు వేరైనప్పటికి అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల్లో తెరాసను ఒడించేందుకే అజెండాగా కాంగ్రెస్, బిజెపి, టిడిపిలు ఐక్య కూడమిగా ఏర్పడి ఈ ఎన్నికల్లో బరిలో దిగారు. దీంతో అచ్చంపేట నగర పంచాయతీ వాతావరణం ఒక్కసారిగా రసవత్తరంగా మారి జిల్లా వ్యాప్తంగా ప్రజల దృష్టంతా ఇటువైపే మళ్లింది. అచ్చంపేట నగర పంచాయతీ ఏర్పడ్డాక తొలిసారిగా ఈ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో 71శాతం పోలింగ్ కావడం విశేషం. 13193మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని అభ్యర్థుల భవితవ్యాన్ని ఈ నెల 9వ తేదిన ఈవిఎంల ద్వారా బయటపెట్టనున్నారు. ఇదిలా ఉండగా అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికలకు జరిగిన పోలింగ్ సరళిలో తెరాసది పైచేయి అయినప్పటికి కాంగ్రెస్, బిజెపి, టిడిపిల ఐక్య కూటమిల అభ్యర్థులు గట్టీ పోటీ ఇచ్చినట్లు తెలుస్తుంది. 20వార్డులలో దాదాపు ఐక్య కూటమి ఎడెనిమిది వార్డులలో బలంగానే పోటీ ఇచ్చినట్లు పట్టణంలో జోరుగా ప్రచారం జరుగుతుంది. టిఆర్‌ఎస్ శ్రేణులు మాత్రం పదిహేన్ నుండి పద్దెనిమిది స్థానాలలో తాము గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఐతే పోలింగ్ జరుగుతున్న సమయంలో ఎప్పటికప్పుడు రాష్ట్ర స్థాయి టిఆర్‌ఎస్ నాయకులతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు అచ్చంపేట నగర పంచాయతీ ఓట్ల సరళిపై ఎప్పటికప్పుడు ఆరా తీశారు. అదేవిధంగా ఇటు కాంగ్రెస్, టిడిపి, బిజెపి నాయకులు కూడా పోలింగ్ జరుగుతున్న తీరుపై ఎప్పటికప్పుడు తమ నేతల దగ్గర సమాచారం తెలుసుకున్నారు. అయితే టిఆర్‌ఎస్ నాయకులు, ఐక్య కూటమి నేతలు ఈ ఎన్నికలను మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా భావించి తమ శాయశక్తుల గెలుపే ధ్యేయంగా అన్ని రకాలుగా ఓటర్లను ప్రలోబ పెట్టి తమ వైపు మళ్లించుకునే ప్రయత్నం చేశారని చెప్పవచ్చు. ఓ పక్క పోలింగ్ జరుగుతున్నా మరోపక్క వీధుల్లో ఓటర్లను ఇరు పార్టీల నేతలు ప్రలోబాలకు గురిచేయడం గమనార్హం. ఏదిఏమైనప్పటికి అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా పోలింగ్ జరగడంతో పోలీస్ యంత్రాంగం, అటు అధికారులు, అన్ని రాజకీయ పార్టీల నేతలు, పట్టణ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. 20వార్డులలో 10వార్డులను సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలుగా పోలీస్ యంత్రాంగం గుర్తించినప్పటికి ఆబూతులలో కూడా పోలింగ్ ప్రశాంతంగా జరగడంతో పోలీస్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం అభ్యర్తుల భవితవ్యం మాత్రం ఈవిఎంలో దాగి ఉండడం..ఈ నెల తొమ్మిదవ తేదిన ఓటర్ల తీర్పు ఎవరిని వరిస్తుందో వేచిచూడాల్సిందే.
భారీ బందోబస్తు మధ్య అచ్చంపేట నగరపంచాయతీ ఎన్నికలు
ఉప్పునుంతల, మార్చి 6: అచ్చంపేట నగరపంచాయతీకి తొలిసారిగా ఆదివారం జరిగిన ఎన్నికలు భారీ బందోబస్తు మధ్య జరిగాయి. ఈ ఎన్నికలు అధికార టిఆర్‌ఎస్, ఐక్య కూటమి మధ్య హోరాహోరీగా జరుగుతుండటంతో పోలీసులు సవాల్‌గా స్వీకరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు చర్యలు తీసుకున్నారు. ఎన్నికలలో భాగంగా పట్టణంలో జడ్పీహెచ్‌ఎస్ బాలురు, బాలికలు, జడ్పీహెచ్‌ఎస్ టంగాపూర్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, జడ్పీ హెచ్‌ఎస్ ఉర్దుమీడియం పాఠశాలలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క కేంద్రం వద్ద నలుగురు ఎస్సైలను నియమించారు. నాగర్‌కర్నూల్ డిఎస్పీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల బందోబస్తుకు ఆరుగురు సిఐలను నియమించి పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించి ఓటర్లు ప్రశాంతంగా తమ ఓటుహక్కును వినియోగించుకునేలా తగిన చర్యలు చేపట్టారు. పట్టణంలోని మొబలింగ్, పెట్రోలింగ్ పార్టీలతో ఎలాంటి అల్లర్లకు, పుకార్లకు తావులేకుండా ప్రశాంత వాతావరణం నెలకొల్పేలా పోలీసులు తగిన చర్యలు తీసుకున్నారు. అచ్చంపేట ప్రధాన రహదారిపై అభ్యుదయ పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా బారికేట్లను ఏర్పాటు చేశారు. పట్టణంలో ఎక్కడ కూడా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడకుండా ప్రత్యేక పోలీస్ అధికారులను నియమించారు. జిల్లాలో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన నగరపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు తీసుకున్న చర్యలతో పట్టణ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వలసల నుంచి అచ్చంపేటకు భారీగా తరలివచ్చిన ఓటర్లు
లింగాల: బతుకుదెరువుకోసం సుదీర ప్రాంతాలకు కూలీ పనులకోసం వెళ్లిన వలస కూలీలు అచ్చంపేట నగరపంచాయతీ ఎన్నికల పుణ్యమా అని తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అచ్చంపేటకు వచ్చి ఆదివారం తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అచ్చంపేట నగరపంచాయతీ అయిన తరువాత తొలి ఎన్నికలు కావడంతో అన్నీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో కూలీ పనులకోసం, ఇతరాత్ర కారణాలతో ఇతర ప్రాంతాలకు వెళ్లిన ఓటర్ల వివరాలను తెలుసుకొని వారిని ఓటింగ్‌లో పాల్గొనేవిధంగా ఆయా పార్టీల నేతలు వ్యక్తిగతంగా శ్రద్ద తీసుకొని ప్రైవేట్ వాహనాలతో వారిని అచ్చంపేటకు వచ్చేవిధంగా ఏర్పాట్లు చేయడంతో ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగింది. ఉదయం నుంచే ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు ఉత్సాహం చూపడంతో పోలింగ్ సరళి పెరిగింది. మండుటెండలనుసైతం లెక్కచేయకుండా పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు బారులుతీరారు. నగరపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. వలసల నుంచి వచ్చిన ఓటర్లను పోలింగ్ రోజున కూడా ప్రలోభాలకు గురిచేసి మచ్చిక చేసుకునేందుకు ఆయా పార్టీల నాయకులు విశ్వప్రయత్నాలు చేయడం కొసమెరుపు.