క్రీడాభూమి

క్రిస్ గేల్ అరుదైన రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టి-20 ఫార్మెట్‌లో 600 సిక్సర్ల మైలురాయని చేరిన తొలి బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు
బ్రిస్బేన్, డిసెంబర్ 19: టి-20 మ్యాచ్‌ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ రికార్డు సృష్టించాడు. మెల్బోర్న్ రెనెగెడ్స్ తరఫున ఆడుతున్న అతను శనివారం బ్రిస్బేన్ హీట్‌తో జరిగిన బిగ్ బాష్ మ్యాచ్‌లో 23 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతను రెండు సిక్సర్లు బాది, టి-20 ఫార్మెట్‌లో 600 సిక్సర్లు కొట్టిన తొలి బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన బ్రిస్మేన్ 49.3 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది. అనంతరం మెల్బోర్న్ 34.1 ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయి 184 పరుగులు చేసి, తొమ్మిది వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. కాగా, 600 సిక్సర్ల మైలురాయిని చేరిన గ్రేల్ ఖాతాలో 653 ఫోర్లు కూడా ఉన్నాయి. ఆస్ట్రేలియాకు చెందిన బ్రాడ్ హాడ్జ్ 664 ఫోర్లతో అగ్రస్థానంలో ఉండగా, గేల్ రెండో స్థానాన్ని ఆక్రమించాడు. బ్రెండన్ మెక్‌కలమ్ 605 ఫోర్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. గేల్ ఇప్పటి వరకూ 227 టి-20 మ్యాచ్‌లు (223 ఇన్నింగ్స్) ఆడి, 8,386 పరుగులు సాధించాడు. 175 (నాటౌట్) అతని అత్యధిక స్కోరు. 16 సెంచరీలు, 53 హాఫ్ సెంచరీలు చేశాడు. పది పర్యాయాలు డకౌటైనప్పటికీ, పరిమిత ఓవర్ల ఫార్మెట్స్‌లో విధ్వంసక బ్యాటింగ్ చేసే బ్యాట్స్‌మెన్ జాబితాలో అతనికి స్థానం దక్కింది.
సిక్సర్లు బాదడంలో ప్రసిద్ధుడైన గేల్ టి-20 ఫార్మెట్‌లో సిక్స ర్లు, ఫోర్లలో 600 మైలురాయని అధిగమించిన తొలి బ్యాట్స్ మన్ గానూ రికార్డు పుటల్లో స్థానం సంపాదించాడు. సిక్సర్ల జా బితాలో ద్వితీయ స్థానంలో ఉన్న కీరన్ పోలార్డ్ 388 సిక్సర్లు కొ ట్టాడు. గేల్‌కు మిగతా బ్యాట్స్‌మెన్‌కు ఉన్న తేడాతో ఏమిటో, అతను ఎలా ఆడతాతో చెప్పడానికి ఇదో ఉదాహరణ.