గీతాంజలి సరదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘గీతాంజలి’ సినిమాతో మంచి హిట్‌ను అందుకున్న తెలుగు భామ అంజలికి ప్రస్తుతం అవకాశాలు జోరందుకున్నాయి. ప్రముఖ నటుడు బాలకృష్ణ సరసన ‘డిక్టేటర్’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న అంజలి, మరోవైపు గెస్ట్‌పాత్రలకు కూడా ఓకె చెబుతోంది. ఇటీవలే ‘శంకరాభరణం’ చిత్రంలో గెస్ట్ పాత్రలో నటించిన ఈ భామకు తాజాగా మరో క్రేజీ అవకాశం దక్కింది. మంచు విష్ణు హీరోగా నటించే చిత్రంలో రెండో హీరోయిన్‌గా అంజలి ఎంపికైంది. ‘సరదా’ పేరుతో తెరకెక్కే ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. మరోవైపు క్రేజీ అవకాశాలు రావడంతో రెమ్యూనరేషన్ కూడా బాగానే వసూలు చేస్తోందట అంజలి. మొత్తానికి దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే నానుడి తెలిసినట్టుంది. అందుకే రోజులెక్కన రెమ్యూనరేషన్ వసూలు చేస్తోంది. ‘సరదా’లో ఆమె పాత్ర పదిరోజులకుగాను అరకోటి తీసుకున్నట్టు తెలుస్తోంది.