జాతీయ వార్తలు

ఆరోగ్య రంగంలో హోమియో, భారతీయ వైద్యం కీలక పాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మే 19: దేశ ఆరోగ్య రంగంలో హోమియోపతి, భారతీయ వైద్య వ్యవస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. శుక్రవారం ఉదయం ఇక్కడి సైన్స్ సిటీ ఆడిటోరియంలో హోమియోపతి పురస్కారాల ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడుతూ అలోపతి వైద్యంతో పోలిస్తే హోమియోపతి, భారతీయ వైద్యం చౌకగా లభించడంతో పాటు వీటి వల్ల ఎలాంటి దుష్ఫలితాలు లేకపోవడం వల్ల ఎక్కువ ప్రజాదరణ పొందాయని అన్నారు. హోమియోపతితో పాటు యునాని, సిద్ధ వంటి భారతీయ వైద్యం దేశ ఆరోగ్య రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, ఇవి అర్హులైన మెడికల్ ప్రాక్టీషనర్ల కొరతను తీవ్రంగా ఎదుర్కొంటున్నాయని ఆయన తెలిపారు. రాష్టప్రతి భవన్‌లో హోమియోపతి, ఇతర వైద్య కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఇవి ఎక్కువ మంది రోగులను ఆకర్షిస్తున్నాయని ప్రణబ్ ముఖర్జీ వివరించారు. అంతకుముందు కార్యక్రమ నిర్వాహక సంస్థ అలెన్ హోమియోపతి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ ప్రణబ్ ముఖర్జీ రెండోసారి రాష్టప్రతి పదవిని చేపట్టాలని ఆకాంక్షించారు. దేశంలోని 196 హోమియోపతి వైద్య కళాశాలలకు చెందిన కొంతమంది టాపర్లతో పాటు బంగ్లాదేశ్‌లోని రెండు కళాశాలలకు చెందిన ఇద్దరు టాపర్లకు రాష్టప్రతి ఆరవ డాక్టర్ మాలతి అలెన్ నోబుల్ అవార్డును అందజేశారు. ఇతర టాపర్లకు ఈ నెల చివరలో ఈ పురస్కారాలను అందజేయనున్నారు. రాష్టప్రతి ఈ సందర్భంగా అనేక మందిని డాక్టర్ అలెన్ మహాత్మా మహ్నేమన్ అవార్డు, డాక్టర్ సర్కార్ అలెన్ స్వామీజీ అవార్డు, డాక్టర్ మాలతి అలెన్ మెమోరియల్ అవార్డుతో సత్కరించారు. డాక్టర్ మాలతి అలెన్ చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ జిపి సర్కార్ మాట్లాడుతూ ప్రస్తుతం హోమియోపతి దేశంలోని 60 శాతం మంది ప్రజలకు సేవలందిస్తోందని తెలిపారు. ఈ వైద్యం మరింత ప్రజాదరణ పొందాలనేది లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అంతకు ముందు ప్రణబ్ ముఖర్జీ మాజీ రాష్టప్రతి నీలం సంజీవరెడ్డి జయంతిని పురస్కరించుకొని రాజ్‌భవన్‌లోని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. నీలం సంజీవరెడ్డి 1977 నుంచి 1982 వరకు రాష్టప్రతిగా పనిచేశారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ కెఎన్ త్రిపాఠి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

చర్చిలో మతమార్పిళ్లు!
హిందూ యువవాహిని కార్యకర్తల హల్‌చల్
భదోహి, మే 19: బిజెపి పాలిత ఉత్తరప్రదేశ్‌లో మతమార్పిడుల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్థాపించిన హిందూ యువ వాహనికి చెందిన కార్యకర్తలు శుక్రవారం జిల్లాలోని ఔరాయి ప్రాంతంలో ఓ క్రైస్తవ ప్రార్థనా మందిరం ఎదుట ఆందోళనకు దిగారు. ఔరాయి తాలూకాలోని తియురి గ్రామంలో కొత్తగా నిర్మించిన ఒక ఇంటిని చర్చిగా ఉపయోగించుకుంటూ దళితులను బలవంతంగా మతమార్పిడి చేస్తున్నారంటూ ఆ ఇంటిలోకి చొరబడి గొడవ చేశారు. కేరళకు చెందిన అజ్మోన్ అబ్రహాం అనే ఒక వ్యక్తిని నిర్బంధించిన కార్యకర్తలు విషయం తెలిసి రంగ ప్రవేశం చేసిన పోలీసులకు అప్పగించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోందని, అబ్రహాంను ప్రశ్నిస్తున్నట్లు ఔరాయి పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ ఓంకార్ సింగ్ యాదవ్ చెప్పారు. వాస్తవాలు తెలసుకోవడానికి గ్రామస్థులను ప్రశ్నిస్తున్నామని, చర్చిగా ఉపయోగిస్తున్న ఇంటి చుట్టూ భద్రతను పెంచామని కూడా ఆయన చెప్పారు. కాగా. గత కొంతకాలంగా ఇక్కడ మతమార్పిడులు జరుగుతున్నాయని, తాము ఇంతకు ముందు పోలీసులకు ఈ విషయం చెప్పినా పట్టించుకోలేదని, అందుకే తామే రంగంలోకి దిగాల్సి వచ్చిందని జిల్లా హిందూ యువవాహిని ఇన్‌చార్జి సురభ్ శర్మ చెప్పారు. కాగా, యోగి ఆదిత్యనాథ్ యుపి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత హిందూ యువ వాహని కార్యకర్తలు చర్చిల ముందు ఆందోళనలు చేయడం ఇది రెండోసారి. గత నెల మహరాజ్ గంజ్‌లోని ఓ చర్చిలో ప్రార్థనలు చేస్తున్న 150 మందిని యువ వాహిని కార్యకర్తలు చెదరగొట్టారు. ఈ సంఘటనపై దర్యాప్తు ఇంకా కొనసాగుతుండగానే ఇప్పుడు ఈ సంఘటన జరిగింది.