రాష్ట్రీయం

ర్యాగింగ్ రహిత రాష్ట్రంగా ఎపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు

గుంటూరు, నవంబర్ 24: రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ర్యాగింగ్ లేకుండా చేయడమే ప్రభుత్వ ధ్యేయమని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగిన ర్యాగింగ్ ఘటనపై అధ్యాపకులు, అధికారులు, విద్యార్థులతో సమీక్షించేందుకు విచ్చేసిన మంత్రి గంటా విలేఖర్లతో మాట్లాడారు. ర్యాగింగ్ భూతాన్ని లేకుండా చేయాలని కృతనిశ్చయంతో ప్రభుత్వం అన్ని వర్సిటీల్లో అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగిందన్నారు. అందువల్లే స్వల్ప సంఘటన జరిగినప్పటికీ విద్యార్థులు సమస్యకు పరిష్కారం లభిస్తుందనే ఉద్దేశంతో ఫిర్యాదు చేశారన్నారు. వెనువెంటనే వర్సిటీ అధికారులు బాధ్యులపై చర్యలు తీసుకున్నారని తెలిపారు. అయినప్పటికీ ఆర్కిటెక్చర్ కళాశాలలో మరోసారి ర్యాగింగ్ జరగడంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసేందుకు ఇద్దరితో కమిటీ వేయనున్నట్లు చెప్పారు. అంబేద్కర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ కృష్ణమోహన్, పద్మావతి మహిళా యూనివర్సిటీ ప్రొఫెసర్ విజయలక్ష్మి ఈ ఘటనపై దర్యాప్తుచేసి నివేదిక అందజేస్తారన్నారు. విద్యార్థులు కూడా తమ అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించాలన్నారు. విద్యార్థులు కోరిన విధంగా వర్సిటీలో పర్మినెంట్ వీసీని, ఫ్యాకల్టీని నియమిస్తామన్నారు. ఆర్కిటెక్చర్ విద్యార్థులు కోరిన విధంగా విద్యుత్ దీపాలను పెంచుతామన్నారు. పరిశుభ్రతకు కూడా తొలి ప్రాధాన్యమిస్తామన్నారు. బాలసుబ్రహ్మణ్య కమిటీ సిఫార్సుల్లో భాగంగా సీనియర్, జూనియర్ విద్యార్థుల భోజన సమయాల్లో మార్పునకు చేసిన సూచనను వెంటనే అమలుచేయాలని అధికారులను ఆదేశించారు. ర్యాగింగ్‌ను సమూలంగా లేకుండా చేయడానికి అన్ని యూనివర్సిటీల వీసీలతో పాటు చీఫ్ సెక్రటరీ, డిజిపిలతో నిర్వహించిన సమావేశంలో నిబంధనావళిని రూపొందించామన్నారు. విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడితే చదువుకు శాశ్వతంగా దూరం చేయడమే కాకుండా ఉద్యోగార్హత కూడా లేకుండా చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు.