రాష్ట్రీయం

పదిలోగా తేల్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జిహెచ్‌ఎంసి ఓటర్ల తొలగింపుపై
ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, డిసెంబర్ 3:గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్ధ పరిధిలో తొలగించిన 6.3 లక్షల ఓట్ల విషయమై ఈ నెల పదిలోగా తుది నిర్ణయం తీసుకుని తమకు తెలియచేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల ప్రదానాధికారి నుంచి తక్షణమే నివేదిక తెప్పించుకుని నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. జిహెచ్‌ఎంసి పరిధిలో తొలగించిన 6.3 లక్షల ఓట్ల అంశం తేలే వరకు వార్డుల వారీగా బిసి ఓటర్ల జాబితాను ప్రచురించరాదంటూ టిడిపి కార్యదర్శి ఫిరోజ్ ఖాన్,కాంగ్రెస్ బిసి సెల్ చైర్మన్ నాగేష్ ముదిరాజ్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. బిసి రిజర్వేషన్ల అంశం, తొలగించిన 6.3 లక్షల ఓటర్ల విషయం తేలే వరకు జిహెచ్‌ఎంసి ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయరాదని పిటిషనర్ల తరఫున వాదించిన న్యాయవాదులు హైకోర్టును అభ్యర్ధించారు. ఎన్నికల సంఘం తరఫున్యాయవాది అవినాష్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ ఓటర్ల జాబితాలో నుంచి మరణించిన వారి పేర్లు, తలుపులు తాళం వేసి ఉన్నందుకు వారి పేర్లను అధికారులు తొలగించారన్నారు. ఇంతవరకు ఓటర్ల తొలగింపుపై ఇసికి 22 వేల ఫిర్యాదులు అందాయని, వీటిలో 1100 ఫిర్యాదులను కొట్టివేశామని, అలాగే 13వేల అప్పీల్స్‌ను స్వీకరించామన్నారు. మరో 8 వేల ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఓటర్ల పేర్ల తొలగింపుపై ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల ప్రదానాధికారి నుంచి నివేదిక అందలేదని ఆయన కోర్టుకు తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతున్నందున కేంద్ర ఎన్నికల సంఘం ఈ విషయమై సత్వరమే నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. డిసెంబర్ 10వ తేదీలోపల తీసుకునే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియచేయాలన్నారు. అనంతరం ఈ కేసు విచారణను డిసెంబర్ 15వ తేదీకి వాయిదా వేశారు.