తెలంగాణ

ఇంటర్ విద్యార్థిని అనుమానస్పద మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగరంలోని దిల్‌సుఖ్‌నగర్ వద్ద కమలానగర్‌లో మంగళవారం తెల్లవారుజామున రోడ్డుపై రక్తపు మడుగులో ఇంటర్ విద్యార్థిని మృతదేహం పడి ఉండటం సంచలనం సృష్టించింది. మృతురాలిని తుకారాంగేట్ పోలీసుస్టేషన్‌లో సిఐగా పని చేస్తున్న అర్జున్ కుమార్తె చందనగా గుర్తించారు. ఓ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న చందన తాము ఉంటున్న భవనం రెండో అంతస్తు నుంచి కిందకి దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు. ఐతే పోస్టుమార్టం నివేదిక వస్తేగానీ ఏ విషయం చెప్పలేమని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.