ఆంధ్రప్రదేశ్‌

పెళ్లికి ముందు యువతి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు: మరో పదిరోజుల్లో ప్రేమించిన యువకుడితో పెళ్లి జరగాల్సి ఉండగా ఓ యువతి ఆత్మహత్య చేసుకోవడం ఏలూరులో సంచలనం సృష్టించింది. స్థానిక పడమర వీధికి చెందిన లావణ్య (22) గురువారం ఉదయం పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె తల్లిదండ్రులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు. బట్టల దుకాణంలో పనిచేసే లావణ్య, అక్కడే పనిచేస్తున్న వెంకట్ ప్రేమించుకున్నారు. కులాలు వేరైనా వీరి పెళ్లికి ఉభయ కుటుంబాల వారు అంగీకరించారు. ఈ నెల 24న పెళ్లి జరపాలని నిర్ణయించి అందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇంతలోనే ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందన్న విషయమై పలు అనుమానాలు చెలరేగుతున్నాయి.