రాష్ట్రీయం

జికా వైరస్‌పై అప్రమత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 5: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న జికా వైరస్‌పై ఆంధ్రప్రదేశ్ వైద్య ,ఆరోగ్య శాఖ అప్రమత్తం అయ్యింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశిత ప్రోటోకాల్ ప్రకారం తీసుకోవలసిన చర్యలపై ఎపి సచివాలయం నండి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆంధ్రలోని ప్రధాన విమానాశ్రయాలు గన్నవరం, తిరుపతి, విశాఖ, పుట్టపర్తితో పాటు ఇతర విమనాశ్రయాలు, ప్రధాన పోర్టులు కృష్ణపట్నం, కాకినాడ, గంగవరం, విశాఖ నగరాల్లో జికా వైరస్‌పై ప్రజలను అప్రమత్తం చేసేందుకు హెల్త్ డెస్క్‌లను ఏర్పాటు చేయాల్సిందిగా అన్ని జిల్లాల వైద్యశాఖ అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. పగటి పూట కుట్టే ఈడిస్ ఈజిప్ట్ వల్ల ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందనే విషయాన్ని ప్రచారం చేయాల్సిందిగా అధికారులను మంత్రి కోరారు. జికా వైరస్ ప్రభావిత దేశాలైన లాటిన్ అమెరికా, స్పెయిన్ వెళ్లి వచ్చే వారి పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రచారం చేయాల్సిందిగా అధికారులకు మంత్రి సూచించారు. తలనొప్పి, జ్వరంతో బాధపడుతున్న గర్భిణులను వెంటనే గుర్తించి వారికి రక్త పరీక్షలు చేయాలని సూచించారు. రాయలసీమ, కృష్ణా, నెల్లూరు, విశాఖ జిల్లాల్లో గతంలో డెంగ్యూ కేసులు నమోదైన దృష్ట్యా ఆయా జిల్లాల్లో జికా వైరస్‌పై విస్తృత ప్రచారం చేయాల్సిందిగా మంత్రి పేర్కొన్నారు. జికా వైరస్ బాధితులకు కనీసం రెండు పడకలు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని అన్నారు. దోమల వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి పంచాయతీరాజ్, మున్సిపల్ ఇతర స్థానిక సంస్థల సహకారంతో పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు చేపట్టాలని మంత్రి పేర్కొన్నారు. ఈ నెల 8వ తేదీ నుండి తల్లి బిడ్డల వారోత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని, ఈ వారోత్సవాల్లో తల్లులకు , బాలింతలకు జికా వైరస్‌పై అవగాహన కల్పించాలని చెప్పారు. 10వ తేదీ నుండి నులిపురుగుల నివారణ నియంత్రణపై అవగాహనలో భాగంగా ఉచితంగా మందులు, టాబ్లెట్‌లు సరఫరా చేయాలని మంత్రి ఆదేశించారు.