గుంటూరు

కార్తీక భక్తులతో కిక్కిరిసిన కాకాని శివాలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెదకాకాని, నవంబర్ 14: ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటైన పెదకాకానిలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానం సోమవారం కార్తీకపౌర్ణమిని పురస్కరించుకుని భక్తులతో కిక్కిరిసిపోయింది. సుదూర ప్రాంతాల నుండి ఆలయానికి చేరుకున్న భక్తులు యజ్ఞాల బావివద్ద కార్తీకస్నానం ఆచరించి ప్రదక్షిణలు చేసి స్వామివారు, అమ్మవార్లను దర్శించుకుని కార్తీకదీపారాధన చేశారు. ఈ సందర్భంగా ఆలయ సహాయ కమిషనర్ సుబ్బారావు మాట్లాడుతూ సుమారు లక్ష మంది భక్తులు ఆలయానికి విచ్చేసి ఉంటారన్నారు. క్యూలైన్లు, సదుపాయాలు కల్పించామని తెలిపారు. కలెక్టర్ కాంతిలాల్ దండే దంపతులు, దేవాదాయశాఖ ట్రిబ్యునల్ చైర్మన్ వి రమణరాయులు దంపతులు, దేవాదాయశాఖ సహాయ కమిషనర్ కెబి శ్రీనివాసరావు పలువురు ప్రముఖులు స్వామివారికి దర్శించుకున్నారు. పాలక మండలి సభ్యులు, అధికారులు ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. కార్యక్రమంలో పాలకమండలి చైర్‌పర్సన్ పెద్ది రాధా, సభ్యులు ఆళ్ల సాంబశివరావు, శ్రీనివాసరావు, కోడూరి రవికుమార్, ఆలపర్తి వెంకటరావు, శివరామిరెడ్డి, నరసింహారావు, శేషిరెడ్డి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.