గుంటూరు

బాలికపై అత్యాచార యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్తెనపల్లి, డిసెంబర్ 20: సత్తెనపల్లి పట్టణానికి సమీపంలోని నరసరావుపేట రోడ్డులోని రిలాక్స్ రెస్టారెంట్ సమీపంలో సుమారు 16 సంవత్సరాల బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి యత్నించారు. సత్తెనపల్లి పోలీసుల కథనం ప్రకారం.. క్రోసూరు మండలం బయ్యవరం గ్రామానికి చెందిన బాలిక నరసరావుపేట పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతోంది. క్రిస్మస్ పండుగ సందర్భంగా తన సమీప బంధువు ఈ బాలికను ద్విచక్ర వాహనంపై రాత్రి 8 గంటల తరువాత నరసరావుపేట నుండి స్వగ్రామమైన బయ్యవరానికి తీసుకొస్తున్నాడు. మార్గంమధ్యలో వారు పట్టణానికి సమీపంలోని రిలాక్స్ రెస్టారెంట్ వద్దకు రాగానే బాలిక మూత్ర విసర్జనకని బండి దిగి కొంతదూరం రోడ్డుపక్కకు వెళ్లింది. అప్పటికే అక్కడ మద్యం తాగి వున్న నిందితులు సత్తెనపల్లి పట్టణానికి చెందిన శెట్టి మహంకాలరావు, ఒంటిపులి వెంకటేశ్వర్లు, అంగలూరి రంజిత్ బాలిక చీకట్లోకి వెళుతున్న విషయాన్ని గమనించి వెంబడించారు. ఆమెను పట్టుకొని సామూహిక అత్యాచారానికి ప్రయత్నించారు. అడ్డుకోబోయిన బాలిక బంధువును తీవ్రంగా కొట్టారు. ఇద్దరూ బిగ్గరగా కేకలు వేయడంతో సమీపంలోని రిలాక్స్ రెస్టారెంట్‌లోని కొందరు సత్తెనపల్లి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. డిఎస్పీ యం మధుసూదనరావు, రూరల్ సిఐ బి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ముప్పాళ్ళ ఎస్సై శ్రీహరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జీవితకాలంలో దేశసేవ
మరణానంతరం అవయవదానం
తాడేపల్లి, డిసెంబర్ 20: ప్రకాశం జిల్లా మార్కాపురం పెద్ద మాచవరానికి చెందిన బూదాల విజయరావు(45) ఆర్మీలో సిపాయిగా పనిచేస్తూ 2005లో రిటైరయ్యారు. అధిక రక్తపోటు, మధుమేహం, రక్తనాళాలు పగిలి రక్తం గడ్డకట్టడంతో విజయరావును మణిపాల్ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు చికిత్స చేసినప్పటికీ పరిస్థితిలో మార్పురాకపోవటంతో బ్రెయిన్‌డెడ్ కేసుగా గుర్తించారు. కుటుంబ సభ్యుల ఆమోదంతో జీవన్‌దాన్ విసి రవిరాజు, డాక్టర్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో విజయరావు అవయవదానం జరిగింది. కాలేయం మణిపాల్ ఆసుపత్రికి, నేత్రాలు ఎల్‌వి రావు ఆసుపత్రికి పంపించారు. మధుమేహం కారణంగా కిడ్నీలు దానం చేయలేదని మణిపాల్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.