గుంటూరు

జన్మభూమి సాక్షిగా తమ్ముళ్ల బాహాబాహీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 6.. జన్మభూమి సాక్షిగా తెలుగు తమ్ముళ్లు బాహాబాహీ తలపడ్డారు.. సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు, జడ్పీ చైర్‌పర్సన్ జానీమూన్ వర్గీయులు కుమ్ములాటకు దిగారు.. శుక్రవారం జానీమూన్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకుమాను మండలం అప్పాపురంలో జన్మభూమి గ్రామసభ రసాభసగా ముగిసింది. సభలో జడ్పీ చైర్‌పర్సన్ మాట్లాడుతూ మండలంతో పాటు గ్రామాభివృద్ధికి కొందరు అడ్డుతగులుతున్నారని పరోక్షంగా రావెల వర్గీయులను ఉటంకించారు. దీంతో అక్కడే ఉన్న రావెల అనుచరులు కొందరు అభ్యంతరం వ్యక్తం చేయటంతో వాగ్వాదం చెలరేగింది. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది.. దీంతో పోలీసులు రంగప్రవేశంచేసి చెదరకొట్టారు. గత కొద్దిరోజుల క్రితం మంత్రి రావెలపై జానీమూన్ బహిరంగంగా ఆరోపణలు చేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇరువురిని తీవ్రస్థాయిలో మందలించి పార్టీ ప్రతిష్టను దిగజార్చవద్దని హెచ్చరికలు జారీచేశారు. ఇరువురి మధ్య సయోధ్య కుదిర్చేందుకు డిప్యూటీ సిఎం చినరాజప్ప, సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, జిల్లా పార్టీ అధ్యక్షుడు, వినుకొండ ఎమ్మెల్యే జివి ఆంజనేయులును నియమించారు. త్రిసభ్య కమిటీ ఇటీవలే ఇరువురి వాదనలను రికార్డుచేసి పార్టీ అధినేతకు సమర్పించారు. ఈ నేపథ్యంలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. జడ్పీ చైర్‌పర్సన్‌కు, తనకు ఎలాంటి శత్రుత్వంలేదని, పార్టీ ఆదేశానుసారం సంయమనంతో మెలుగుతామని మంత్రి రావెల అప్పట్లో స్పష్టం చేశారు. అప్పాపురంలో వివాదం ముదరటంతో స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి మందలించినా నేతల తీరు మారలేదనేందుకు జన్మభూమి గ్రామసభ నిదర్శనంగా నిలుస్తోంది.