గుంటూరు

చెత్తకుప్పలో పసికందు మృతదేహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 2: తల్లి గర్భంలో నుంచి బాహ్యప్రపంచాన్ని చూడకుండానే కన్నుమూసిన ఆడ శిశువు చెత్తకుండీలో శవమై తేలింది. స్థానికులు గుర్తించి జిజిహెచ్ వైద్యులకు సమాచారం అందించారు. అసలే జీజిహెచ్ సిబ్బంది.. ఈ విషయంలో యథాప్రకారం కాస్తంత ఆలస్యంగా స్పందించారు..స్థానికుల ఒత్తిడి మేరకు ఎట్టకేలకు అంతిమసంస్కారాలు నిర్వహించి చేతులు దులుపుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో ఈనెల 24న ఆడశిశువు జన్మించింది. అయితే అనారోగ్య కారణంగా మృతిచెందడంతో తల్లిదండ్రులు సమీపంలోని టిబి ఆసుపత్రి ఎదురు గేటు వద్దగల చెత్తకుప్పలో పడేసివెళ్లారు. గురువారం స్థానికులు గుర్తించారు. శిశువు కొన ఊపిరితో ఉన్నా బతికించే ప్రయత్నం చేయాలనే మానవతా దృక్పథంతో కదిలించి చూశారు. అప్పటికే మృతి చెందడంతో జిజిహెచ్ అధికారులకు సమాచారం అందించారు. మూడు గంటల గడిచినా అధికారులు స్పందించలేదు. దీంతో ఆగ్రహించిన స్థానికులు ఆర్‌ఎంఒ వై.రమేష్‌కు నేరుగా వచ్చి వివరించారు. సిబ్బంది చొరవతో అంత్యక్రియలు పూర్తిచేశారు.
మట్టి అక్రమ తవ్వకాలను అడ్డుకున్న రైతులు
మంగళగిరి, ఫిబ్రవరి 2: మండల పరిధిలోని ఆత్మకూరు చెరువులో నిబంధనలకు విరుద్ధంగా మట్టిని అక్రమంగా తవ్వి రవాణా చేస్తున్నారని ఆరోపిస్తూ రైతులు గురువారం తవ్వకాలను, మట్టి రవాణా లారీలను నిలిపివేశారు. అనుమతులు తెచ్చుకున్నప్పటికీ పాటించడం లేదని రైతులు ఆరోపించారు. లారీలను అడ్డుకుని రైతులు ఆందోళనకు దిగడంతో తవ్వకాలు జరుపుతున్న కాంట్రాక్టర్ మనుషులకు, రైతులకు కొద్దిసేపు వాగ్వివాదం జరిగింది. పోలీసులు రంగప్రవేశం చేసి రైతులను పంపించి వేశారు. మట్టి తవ్వకాలను తాత్కాలికంగా నిలుపుదల చేశారు.