గుంటూరు

అసెంబ్లీ వద్ద భారీవర్షం, కూలిన గుడారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, మార్చి 16: తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి ప్రాంతంలో గురువారం మధ్యాహ్నం భారీవర్షం కురిసింది. వెలగపూడిలోని రాష్ట్ర శాసనసభలో పాలక ప్రతిపక్ష సభ్యుల వాడీవేడి చర్చ అనంతరం సభ సోమవారానికి వాయిదా పడిన కొద్ది నిమిషాల్లోనే ఆ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. అసెంబ్లీ వెలుపల సెక్యూరిటీ సిబ్బందికి, పార్టీల నేతలకు వివిధ పనులపై అసెంబ్లీ వద్దకు వచ్చిన వారికి వేచి ఉండేందుకు ఎండనుంచి రక్షణకు ఏర్పాటు చేసిన గుడారాలు భారీ వర్షం కురవడంతో కూలిపోయాయి. వర్షం రాకతో గుడారాల్లో వేచి ఉన్న సెక్యూరిటీ సిబ్బంది, ఇతరులు వర్షానికి తమను తాము రక్షించుకునేందుకు పరుగుపెట్టి భద్రతగా ఉండే ప్రాంతానికి చేరుకున్నారు. సమీపంలోని పొలాల్లో ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రాంతంలో ఉన్న వాహనాలను వర్షం ప్రారంభం కావడంతోనే ఆయా వాహనాల డ్రైవర్లు అప్రమత్తమై తమ వాహనాలను పొలాల్లోనుంచి రోడ్డుమీదికి తెచ్చుకుని నిలుపుకున్నారు. గతంలో ఒకసారి పొలాల్లో నిలిపిన వాహనాలు వర్షం కురవడంతో రెండు రోజుల వరకు తీసే అవకాశం లేక ఇబ్బందులు పడిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ పర్యాయం వాహన చోదకులు అప్రమత్తమై వాహనాలను నిమిషాల వ్యవధిలోనే సేఫ్టీగా ఉండే తారురోడ్డుపైకి తెచ్చుకున్నారు. శాసనసభ ముగిశాక ప్రతిరోజు మీడియా పాయింట్‌కు వచ్చి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే పాలక ప్రతిపక్ష పార్టీల శాసనసభ్యులు, మండలి సభ్యులు వర్షం కురవడంతో మీడియా పాయింట్ వైపు వచ్చే అవకాశం లేకపోయింది. శాసనసభ సోమవారానికి వాయిదా పడటంతో దూరప్రాంతాల ఎమ్మెల్యేలు తమ తమ ప్రాంతాలకువెళ్లిపోయారు.