గుంటూరు

కునుకు తీస్తున్న ‘సిఎం భద్రత’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడికొండ, మార్చి 25: తాడికొండ నియోజకవర్గంలో వెలగపూడి గ్రామంలో నూతనంగా నిర్మించిన అసెంబ్లీ హాల్లో గత పది రోజుల నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న దృష్ట్యా మండల పరిధిలోని తాడికొండ, అడ్డరోడ్డు, లాం తదితర గ్రామాల్లో మంత్రుల రాక దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తాడికొండ అడ్డరోడ్డు సెంటర్‌లో పోలీస్ కానిస్టేబుల్ విధులు నిర్వహించకుండా నిద్రలోకి జారుకుని చూపరులను ఆకర్షించాడు.
మార్క్‌ఫెడ్ ద్వారా మిర్చిని కొనుగోలు చేయాలి
* రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి
సత్తెనపల్లి, మార్చి 25:రైతుల వద్దనున్న మిర్చిని మార్క్‌ఫెడ్ ద్వారా క్విటా పది వేల చొప్పున కొనుగోలు చేయాలని ఎపి రైతు సంఘ రాష్ట్ర కార్యదర్శి పి పెద్దిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన రైతు ధర్నాలో ఆయన ప్రసంగించారు. జిల్లా కార్యదర్శి వై రాధాకృష్ణ మాట్లాడుతూ సరుకు రైతు వద్ద వున్నపుడు ఒక రకం ధర, తరువాత మరోరకంగా ధరలు వుంటున్నాయని దీనివల్ల రైతులు తీవ్రంగా మోసపోతున్నారని ఆరోపించారను. ముందుగా పట్టణంలోని ప్రధాన కూడళ్ళలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి గుంటుపల్లి బాలకృష్ణ, మండల అధ్యమక్ష, కార్యదర్శులు రావూరి పూర్ణచంద్రరావు, ఇంజం తింగయ్య, మక్కెన నరసింహారావు, కందిమళ్ళ సాంబశివరావు, రావిపాటి వెంకటరత్నం, యం వెంగళరెడ్డి, యర్రమాసు నాగేశ్వరరావు, కౌలు రౌతు జిల్లా అధ్యక్షుడు బొట్లా రామక్రిష్ణ తదితరులు ఈ ధర్నాలో పాల్గొన్నారు.