గుంటూరు

మభ్యపెడుతున్న మంజునాథ కమిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి, మార్చి 25: ఏకులాల వారినైనా బిసిలుగా చేర్చేందుకు జస్టిస్ మంజునాథ కమిషనర్ మసిపూసి మారేడుకాయ చేసేప్రయత్నం చేస్తోందని రాష్ట్ర బిసి సంక్షేమ సంఘ అధ్యక్షుడు కేసన శంకరరావు ఆరోపించారు. శనివారం తెనాలిలోని సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిసి రిజర్వేషన్‌లో గత కమిషన్‌లు తేలేని చట్టబద్ధత మంజునాథ కమిషన్ ఎలా తేగలదని ప్రశ్నించారు. ఏకులాల వారినైనా బిసిలలో చేర్చేప్రయత్నం జరిగితే సహించేది లేదన్నారు. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలోని 13జిల్లాలలో ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయిన దశలో కాకినాడ సమావేశంలో మంజునాథ వ్యవహరించిన తీరు అనేక అనుమానాలను రేకెత్తిస్తోందన్నారు. బిసిల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన విమర్శించారు. సామాజికంగా, విద్యాపరంగా, తరతరాలుగా నిజంగా వెనుకబడిన తరగతుల వారి హక్కులను కాలరాసి ప్రభుత్వ విధివిధానాలకు అనుకూలంగా నివేదిక తయారుచేస్తే మందునాథ చరిత్రలో ఇన్‌జస్టిస్‌గా నిలిచిపోతారని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు జొన్నాదుల వెంకటేశ్వరరావు, మేడిబోయిన గంగాయాదవ్, కందుల సాంబశివరావు గౌడ్, జొన్నాదుల రాహుల్, ఎన్ వెంకటేశ్వరరావు, డాక్టర్ కెఎస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

టిడిపిది అరాచక పాలన
చిలకలూరిపేట, మార్చి 25: తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్న ప్రత్తిపాటి పుల్లారావు అక్రమంగా అగ్రిగోల్డ్ భూములను కొనుగోలు చేశారంటూ చిలకలూరిపేట వైసిపి శ్రేణులు శనివారం ఆందోళన చేశారు. టిడిపి ప్రభుత్వం అవినీతికి పాల్పడుతూ ప్రతిపక్ష నేత జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం వారి కుసంస్కారానికి నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా మంత్రి పుల్లారావు గడ్డిబొమ్మను వైసిపి శ్రేణులు స్థానిక కళామందిర్ సెంటర్‌లో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎవిఎం సుభాని మాట్లాడుతూ మంత్రి పుల్లారావు తన నిజాయితీని నిరూపించుకోవాలి, లేకుంటే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ ప్రతిపక్ష నాయకుడు నాయుడు వాసు, మైనార్టీ సెల్ అధ్యక్షుడు బేరింగ్ వౌలాలి, యువజన విభాగం అధ్యక్షుడు సాతులూరి కోటేశ్వరరావు, కౌన్సిలర్ అబ్దుల్ రవూఫ్ తదితరులు పాల్గొన్నారు.

జగన్ ఒక అరాచక శక్తి
చిలకలూరిపేట, మార్చి 25: అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై జగన్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని, అందుకు నిరసనగా పేట టిడిపి శ్రేణులు చిలకలూరిపేట జాతీయ రహదారిపై శనివారం జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మార్కెట్‌యార్డు చైర్మన్ విడదల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నిజాయితీకి నిలువుటద్దం మంత్రి ప్రత్తిపాటి అని, అటువంటి వ్యక్తిపై జగన్ అసెంబ్లీలో అసత్యారోపణలు చేస్తున్నారన్నారు. ప్రజాక్షేత్రంలో గుణపాఠం చెప్పినా, ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఇటువంటి ప్రతిపక్ష నాయకుడు దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేడన్నారు. కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ రెహమాన్, కార్యదర్శి తోట బ్రహ్మస్వాములు, చిలకలూరిపేట, యడ్లపాడు మండల పార్టీ అధ్యక్షులు అంబటి సోంబాబు, టిడిపి కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.