గుంటూరు

‘్ధర్మపరిరక్షణ’లో అంతా భాగస్వాములు కండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు కల్చరల్, మార్చి 25: తపో, ధ్యాన, జ్ఞాన శక్తి స్వరూపులైన మన మహర్షులు మానవుడిని మహనీయుడుగా, మహోధాత్త వ్యక్తిగా తీర్చిదిద్దటానికి తమ తపోశక్తిని ఈ పవిత్ర యజ్ఞ్భూమిపై ఆనంతంగా ధార పోశారని, వారందించిన థర్మాన్ని పరిరక్షించటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సిన సమయం ఆసన్నమైందని కుర్తాళం సిద్ధేశ్వరీ పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామి పిలుపునిచ్చారు. శనివారం రాత్రి నగరంలోని బ్రాడీపేట ఓంకార క్షేత్రంలో శ్రీ సీతారామాంజనేయ నగర సంకీర్తన సంఘం ఆధ్వర్యాన సిద్ధేశ్వరీ పీఠ శతాబ్ది ఉత్సవ సభ జరిగింది. సభకు ప్రముఖ చార్టెర్డ్ అకౌంటెంట్ గబ్బిట శివరామకృష్ణ ప్రసాద్ అధ్యక్షత వహించారు. వేదస్వస్తి, మంగళవాద్యాల నడుమ వైభవంగా ప్రారంభమైన ఈ సభలో భక్తుల నుద్దేశించి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి ఆశీపూర్వక అనుగ్రహ భాషణం చేశారు. ప్రతి ఒక్కరూ స్వీయ స్వధర్మాలను పాటించాలని, ధర్మ పరిరక్షణ కోసం శక్తివంచన లేకుండా పాటుపడాలని స్వామీజీ కోరారు. మహిమాన్వితుడైన వౌనస్వామి కుర్తాళం పీఠాన్ని నూరేళ్ల క్రితం స్థాపించారని, అంతటి పీఠానికి సేవచేసే భాగ్యం తనకు లభించడం పూర్వజన్మసుకృతంగా భావిస్తున్నానని స్వామీజీ పేర్కొన్నారు. అధ్యక్షత వహించిన శివరామకృష్ణప్రసాద్, ముఖ్యఅతిథి, హిందూ కాలేజీ ఫార్మసీ అధ్యక్షులు డాక్టర్ మన్నవ రాధాకృష్ణమూర్తి, శ్రీశక్తి పీఠాధీశ్వరి మాతాజీ డాక్టర్ రమ్య యోగిని ప్రసంగిస్తూ అనంతమైన శక్తిని సముపార్జించుకున్న వౌనస్వామి తాను స్థాపించిన కుర్తాళం పీఠం ద్వారా జగత్తుకు ఎంతగానో మేలు చేశారన్నారు. ఆ మార్గంలో పయనిస్తున్న ప్రస్తుత పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతీ స్వామి ఉపాసనా మార్గానికి, ధర్మ పరిరక్షణకు పెద్దపీట వేస్తున్నారని ప్రశంసించారు. వౌనప్రభ గౌరవ సంపాదకులు పిఎస్‌ఆర్ ఆంజనేయ ప్రసాద్, ఓంకారక్షేత్రం కార్యదర్శి నోరి నారాయణమూర్తి, న్యాయవాది శ్రీనివాస్, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ప్రచారార్భాటానికే మిర్చియార్డులో జగన్ పర్యటన
గుంటూరు (కొత్తపేట), మార్చి 25: దేశవ్యాప్తంగా మిర్చిపంట దిగుబడి రావడంతో మిర్చ్ధిరలు తగ్గాయని, అయితే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి కేవలం ప్రచారార్ఛాటానికే మిర్చియార్డులో పర్యటించి బురదజల్లే కార్యక్రమం చేశారని గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మన్నవ సుబ్బారావు పేర్కొన్నారు. శనివారం గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ రైతుపై ప్రేమ ఉన్న ప్రతిపక్ష నేత జగన్ అసెంబ్లీలో మిర్చిపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకుండా యార్డుకు వచ్చి నానా యాగీ చేయడమేంటని ప్రశ్నించారు. జగన్ తన పర్యటన వలనే మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించుతారని ఉత్తర ప్రగల్భాలు పలకడం దారుణమన్నారు. గత వారమే మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు యార్డులో పర్యటించి మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. మిర్చిఘాటును తట్టుకోలేక జగన్ నానా అవస్థలు పడుతూ రైతులపై కపట ప్రేమ చూపారని విమర్శించారు. జగన్ పర్యటన వలన మిర్చియార్డులో నిల్వ ఉన్న మిర్చిబస్తాలను నాశనం అయ్యాయన్నారు. అసలు ధరల్లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే ఆయన పర్యటన వల్ల మరింత ఇబ్బంది పడాల్సి వచ్చిందన్నారు. ధరల తగ్గుదలపై అనేకమార్లు సమావేశాలు నిర్వహించామని, చివరకు ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగిందన్నారు. గతంలో యార్డులో అగ్నిప్రమాదం జరిగినప్పుడు వైఎస్ వైఫల్యం చెందారని, అలాగే జగన్ కేవలం ఐదు నిముషాల విహారయాత్రలా మిర్చియార్డులో పర్యటించారన్నారు. రైతులను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. సమావేశంలో యార్డు వైస్ చైర్మన్ కొత్తూరి వెంకట్, డైరెక్టర్లు బాణావత్ రాజీ, ఎస్‌ఎస్‌పి జాదా తదితరులు పాల్గొన్నారు.

ఉత్సాహంగా జాతీయ స్థాయి పశు బల ప్రదర్శన

అచ్చంపేట, మార్చి 25: మండలంలోని వేల్పూరు గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామివారి తిరునాళ్ల సందర్భంగా ఏర్పాటుచేసిన జాతీయస్థాయి పశుబల ప్రదర్శన రణరంగాన్ని తలపిస్తున్నాయి. నువ్వా నేనా అన్నట్లు విజయం కోసం క్రీడాప్రాంగణంలో తలపడుతున్నాయి. శుక్రవారం పాలపళ్లు ఊడని విభాగానికి 24 జతలు పోటీకి హాజరయ్యాయి. వీటిలో మొదటి బహుమతిని ప్రకాశం జిల్లా, పొట్లపాడుకు చెందిన నుసుం బయ్యపురెడ్డి ఎడ్ల జత పది నిముషాల్లో 4,510 అడుగులు బండ లాగి విజయకేతనం ఎగురవేశాయి. రెండవ స్థానంలో అదే గ్రామానికి చెందిన నుసుం గోవిందరెడ్డి ఎడ్లజత 4,500 అడుగులు, 3వ స్థానంలో ఫిరంగిపురం మండలం, యర్రగుండ్లపాడుకు చెందిన కళ్లం లక్ష్మీచైతన్య ఎడ్ల జత, 4వ స్థానంలో నర్సరావుపేట మండలం అగ్రహారంకు చెందిన చందోలు చినకోటేశ్వరరావు జత 4,280 అడుగులు లాగాయి. 5వ స్థానంలో రాజుపాలెం మండలం, ఇనిమెట్లకు చెందిన అరిగెల పాపారావు జత 4,205 అడుగులు లాగాయి. క్రోసూరుకు చెందిన గోపిశెట్టి చంద్రిక ఎడ్ల జత 3,942 అడుగులు బండ లాగి 6వ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. విజేతలకు శనివారం బహుమతులు, జ్ఞాపికలను నిర్వాహకులు అందించారు. శనివారం రెండు పళ్ల విభాగానికి 23 జతలు హాజరయ్యాయి. న్యాయనిర్ణేతలుగా రాధాకృష్ణ, గూండా శ్రీనివాసరావు వ్యవహరిస్తున్నారు. పోటీలను రాయపాటి విశే్వశ్వరరావు, సర్పంచ్ వెంకయ్య, రాము, గ్రామపెద్దలు పర్యవేక్షిస్తున్నారు.