గుంటూరు

పాలకులకు ‘కళలపై మక్కువ’ ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కల్చరల్), మార్చి 27: సమాజంలోని అన్నివర్గాల ప్రజలు భుజం భుజం కలిపి సమైక్యభావనతో ముందుకు సాగాలంటే కళలు వికాసం చెందాల్సిన అవసరం ఉందని, సంగీత, సాహిత్య లలిత కళారంగాలన్నింటినీ పాలకులు ప్రోత్సహించాలని శాసనమండలి చైర్మన్ డాక్టర్ ఎ చక్రపాణి సూచించారు. సోమవారం రాత్రి నగరంలోని బృందావన గార్డెన్స్ అన్నమయ్య కళావేదికపై యువ కళావాహిని హైదరాబాద్, ఆరాధనా ఆర్ట్స్ అకాడమి వారి సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతి నాటకోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరుగురు రంగస్థల ప్రముఖులకు యువ కళావాహిని రంగస్థల పురస్కారాలను ఎమ్మెల్సీ, కనీస వేతనాల సలహామండలి అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్‌తో కలిసి చక్రపాణి అందజేశారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇటీవల కాలంలో నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో కళలను ప్రోత్సహిస్తూనే ఉందని, ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనేక సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతూ, వెన్నుతట్టి ప్రోత్సహించడం పట్ల ఆయన ఆనందం వ్యక్తంచేశారు. చిన్నప్పట్నుంచీ తనకు కళలంటే చాలా ఇష్టమని, ఈ అభిరుచి, కళాకారుల పట్ల గౌరవంతోనే రాత్రి 7.30 గంటల వరకు శాసనమండలి సమావేశాల్లో పాల్గొని నేరుగా సభకు విచ్చేశానన్నారు. రంగస్థలానికి పురిటిగడ్డయిన గర్తపురిలో అమరావతి నాటకోత్సవాలు రెండు రోజుల పాటు బృందావన వెంకన్న సన్నిధిలో నిర్వహించనుండటం ముదావహమన్నారు. గురజాడ కన్యాశుల్కం తదితర నాటకాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ సమాజంలో మార్పులు తీసుకురావడానికి ఇలాంటి ప్రదర్శనలు దోహదం చేస్తాయన్నారు. అధ్యక్షత వహించిన డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ ఆట, పాటలతో తెలంగాణ వచ్చిందని, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో కళలు, కళాకారులు ముఖ్యభూమికను పోషించారన్నారు. కళలు లేనిదే జీవితం లేదని, కళలతోనే జీవితం మమేకమై సాగుతుందన్నారు. ఈ సందర్భంగా నంది బహుమతులు అందుకున్న కావూరి సత్యనారాయణ, నటులు ఉదయ భాగవతుల, జిఎస్ చలపతి, ఆర్ వాసుదేవరావు, ఎస్‌వి అప్పలాచారియర్ (పాత్రికేయుడు), జయలక్ష్మిలకు గురజాడ, బల్లారి రాఘవ, సిఎస్‌ఆర్, గరికపాటి రాజారావు, పనారస గోవిందరావు, రఘురామయ్యల పేరిట ఏర్పాటు చేసిన పురస్కారాలను అందజేశారు. సభను కళావాహిని అధ్యక్షుడు వైకె నాగేశ్వరరావు నిర్వహించారు. సభలో దేవాలయ అధ్యక్షుడు సిహెచ్ మస్తానయ్య, అమరావతి సాంస్కృతిక కేంద్రం సిఇఒ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ పూర్వ అధ్యక్షుడు వల్లభనేని బాబురావు, శారదా కళాసమితి విజయవాడ అధ్యక్షుడు డోగిపర్తి శంకరరావు, డి తిరుమలేశ్వరరావు, జి మల్లిఖార్జునరావు, బి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. సభానంతరం పి మృత్యుంజయరావు రచించిన, ఆర్ వాసుదేవరావు దర్శకత్వం వహించిన అనగనగా సాంఘిక నాటికను ప్రదర్శించారు.

అక్రమ సంబంధం నేపథ్యంలో కానిస్టేబుల్‌కు కత్తిపోట్లు
చేబ్రోలు, మార్చి 27: ఓ వివాహితతో కొనసాగిస్తున్న అక్రమ సంబంధం ఓ కానిస్టేబుల్‌ను పట్టపగలే కత్తిపోట్లకు గురిచేసింది. వివాహిత భర్త స్వయంగా దారికాసి విచక్షణా రహితంగా కానిస్టేబుల్‌ను కత్తితో తీవ్రంగా గాయపర్చాడు. చేబ్రోలు ఎఎస్‌ఐ ఆరాధ్యుల కోటేశ్వరరావు కథనం ప్రకారం... బాపట్ల మండల పరిధిలోని పూండ్ల గ్రామానికి చెందిన కూరపాటి శ్రీనివాసరావు అనే కానిస్టేబుల్ గత కొంతకాలం క్రితం చుండూరు పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేశాడు. ఆ సమయంలో వారి బంధువైన చుండూరు గ్రామానికి చెందినో ఓ వివాహితతో అక్రమ సంబంధం ఏర్పర్చుకున్నాడు. ఇది కాస్త వివాహిత భర్త కూరపాటి ఆనందరావుకు తెలియడంతో వివాదం ముదిరి కేసులు, కోర్టుల వరకూ వెళ్లింది. అయితే కేసు రాజీమార్గం పట్టినప్పటికీ, పోలీసు ఉన్నతాధికారులు కానిస్టేబుల్ శ్రీనివాసరావును సస్పెండ్ చేశారు. గత కొన్ని రోజులుగా కానిస్టేబుల్ శ్రీనివాసరావు విఆర్‌లో ఉంటున్నాడు. అయితే కానిస్టేబుల్ శ్రీనివాసరావు సోమవారం ఉదయం పూండ్ల నుంచి గుంటూరుకు మోటారు బైకుపై వస్తుండగా మార్గమధ్యలో మంచాల గ్రామం స్పీడ్ బ్రేకర్ల వద్దకు రాగానే చుండూరుకు చెందిన కూరపాటి ఆనందరావు బైకును ఆపి శ్రీనివాసరావుపై కత్తితో దాడిచేసి తలపై తీవ్రంగా గాయపర్చాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న శ్రీనివాసరావును చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కానిస్టేబుల్ కూరపాటి శ్రీనివాసరావు, నిందితుడు కూరపాటి ఆనందరావులిద్దరూ బంధువులే. ప్రస్తుతం నిందితుడు ఆనందరావు పరారీలో ఉండటంతో ఇతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.