గుంటూరు

గ్రంథి కుటుంబానికి జగన్ పరామర్శ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (పట్నంబజారు), మార్చి 27: రెండు రోజుల క్రితం దివంగతులైన క్రేన్ సంస్థల అధినేత గ్రంథి సుబ్బారావు కుటుంబ సభ్యులను సోమవారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి పరామర్శించారు. సంపత్‌నగర్‌లోని గ్రంథి సుబ్బారావు స్వగృహానికి పార్టీ నాయకులతో కలిసి చేరుకున్న జగన్ సుబ్బారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. చిన్నతనం నుండి కష్టపడి వ్యాపార రంగంలో దక్షిణాదిలోనే తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న గ్రంథి సుబ్బారావు మృతి తీరనిలోటన్నారు. వచ్చిన ఆదాయంలో ఎక్కువ శాతం సామాజిక, సేవా కార్యక్రమాలకే వినియోగిస్తూ, సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను కుటుంబ సభ్యుల వలె ఆదరించే మంచి వ్యక్తిత్వమున్న గ్రంథి సుబ్బారావు భౌతికంగా మన మధ్యలేకపోవడం బాధాకరమన్నారు. జగన్ వెంట తూర్పు ఎమ్మెల్యే మహ్మద్ ముస్త్ఫా, పార్టీ నాయకులు లేళ్ల అప్పిరెడ్డి, ఆతుకూరి ఆంజనేయులు, కిలారి రోశయ్య, లాలుపురం రాము, అంగడి శ్రీనివాసరావు, పోలూరి వెంకటరెడ్డి, థామస్‌నాయుడు తదితరులున్నారు.

పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి గొప్పలు సరికాదు
మంగళగిరి, మార్చి 27: తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక సచివాలయం నిర్మించిన మాదిరిగా సరిపడా నిధులు లేని పోలవరం ప్రాజెక్ట్‌ను అరకొరగా పూర్తిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దానిగురించి గొప్పలు చెప్పుకోవడం సరికాదని వైఎఆర్ సీపీ ఎమ్మెల్యే విశే్వశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం అమరావతి అసెంబ్లీ ప్రాంగణం మీడియా పాయింట్‌లో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌లతో కలిసి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు గురించి పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన చంద్రబాబు, కెఎల్ రావ్, కాటన్, వైఎస్ రాజళేఖరరెడ్డిలను గుర్తు చేసుకోకపోవడం దురదృష్టకరమని, శాసనసభలో ఇరిగేషన్, విద్య మొదలైన అంశాలు చర్చించాల్సి ఉండగా సభను వాయిదా వేయించి పోలవరంపై పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వటం సరైంది కాదన్నారు. సీడీ చేసి ఇచ్చినా శాసనసభ్యులు చూస్తామని, అంతా మేమే చేశామని గొప్పలు చెప్పుకోవటం దారుణమని, 1940 దశకంలోనే పోలవరం ప్రాజెక్టు కట్టాలనుకున్నా మూలనపడ్డ ఫైలును బూజు దులిపించి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాజెక్టును ప్రారంభించాడని, 5,500 కోట్లు ఖర్చుపెట్టి 35 నుంచి 40 శాతం పనులు వైఎస్ పూర్తిచేశారని ఆయన గుర్తుచేశారు. వెలుగొండ, పోలవరం, గాలేరు నగరి , పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేసి పనులు ప్రారంభించింది వైఎస్సేనని , ఇప్పుడు చంద్రబాబు మాత్రం మిట్టమధ్యాహ్నం అరుంధతీ నక్షత్రం చూపినట్లు బ్రహ్మాండం అని చెబుతున్నారని, చంద్రబాబు అధికారం చేపట్టాక పోలవరం కోసం ఖర్చు పెట్టింది 3,400 కోట్లు మాత్రమేనని, వీటిలో 2900 కోట్లు కేంద్రప్రభుత్వం ఇచ్చిందని, జాతీయ ప్రాజెక్టుగా పోలవరంను గుర్తించినప్పటికీ ఆ విధంగా జరగటం లేదని స్పష్టమవుతోందని విశే్వశ్వరరెడ్డి అన్నారు. రాష్ట్ర విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పోలవరం పనులు సాగటం లేదని, 2019 ఎన్నికల్లో లబ్దికోసం ప్రాజెక్టును చూపుతున్నారని ఆయన విమర్శించారు.