గుంటూరు

2017-18 అంచనా బడ్జెట్ రూ.973.24 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 27: నగరపాలక సంస్థ 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను 973.24 కోట్ల రూపాయలను ఖరారు చేస్తూ కమిషనర్ ఎస్ నాగలక్ష్మి పిఆర్‌ఒ సెల్ ద్వారా సోమవారం విడుదల చేశారు. 2017-18 ప్రారంభ నిల్వ 426.67 కోట్లకు 2016-17 జమలు 546.56 కోట్లు వెరశి మొత్తం 973.24 కోట్లుగా బడ్జెట్ అంచనాల ప్రతిపాదనను నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి, కలెక్టర్ కాంతిలాల్ దండే ఆమోదించారన్నారు. ఈ సందర్భంగా 2017-18 ఖర్చులు 614.04 కోట్లు వ్యయం పోను 359.19 కోట్లు అంత్యనిల్వ ఉంటుందని వివరించారు. కమిషనర్ నాగలక్ష్మి ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరపాలక సంస్థ పన్నులు, ప్రపంచబ్యాంకు నిధులతో సమగ్ర త్రాగునీటి పథకం, 14వ ఆర్థిక సంఘం గ్రాంటు, స్టాంపు డ్యూటీపై సర్‌చార్జీలు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్, సిటీ డెవలప్‌మెంట్ ప్లాను, అభివృద్ధి చార్జీలు, 13వ ఆర్థిక సంఘం గ్రాంటు, ప్రావిడెంట్ ఫండ్, అమృత మిషన్, స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్, షాపింగ్ కాంప్లెక్స్ అద్దెలు, నీటి కుళాయి విరాళాలు తదితరాల ద్వారా వసూళ్లు ఉంటాయన్నారు. వీటితో తారురోడ్లు, వృద్ధాప్య పించన్లు, వితంతు పింఛన్లు, నిర్వహణ ఖర్చులు, రహదారుల విస్తరణ, ప్రధాన కార్యాలయ నిర్మాణం, వాహనాల ఇంధనాల ఖర్చులు, రిజర్వాయర్లు, యంత్రాలు తదితర ఖర్చులు ఉంటాయన్నారు. ఈ ఏడాది నగరపాలక సంస్థ చేపట్టే అభివృద్ధి పనులను ఉదహరించారు.
నెలాఖరు నాటికి ఆస్తిపన్ను నూరుశాతం పూర్తి చేయాలి...
మార్చి నెలాఖరు నాటికి ఆస్తి పన్ను వసూళ్లు నూరుశాతం పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ నాగలక్ష్మి ఆదేశించారు. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం కౌన్సిల్ సమావేశ మందిరంలో బిల్ కలెక్టర్లు, ఆర్‌ఐలు, రెవెన్యూ అధికారులతో సమీక్షించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వచ్చే ఏడాది నుండి ప్రభుత్వం రాష్ట్రంలోని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో ప్రపంచ బ్యాంకు నిధులతో ఈగౌ ఫౌండేషన్ ద్వారా అన్ని సేవలు ఒకే విధానం కిందకు వస్తాయని, ఇందులో రెవెన్యూ, ప్రజారోగ్యం శాఖల అనుసంధానం ఉంటుందన్నారు. వచ్చే నెల నుండి బిల్ కలెక్టర్లు వార్డుల వారీగా అసెస్‌మెంట్ల వారీగా ప్రత్యేకంగా రూపొందించిన ఫార్మెట్లలో సమాచారాన్ని నమోదు చేయాలని, అవసరమైతే బిల్ కలెక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జి అదనపు కమిషనర్ ఎం ఏసుదాసు, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు, ఇఇలు నాయక్, లక్ష్మయ్య, చినకోటేశ్వరరావు, వెంకటేశ్వరరాలు, ఆర్‌ఒలు ఎస్‌ఎస్ ప్రసాద్, వివి రామయ్య, వేణుబాబు తదితరులు పాల్గొన్నారు.