గుంటూరు

సంక్షేమ హాస్టళ్ల మూసివేతకు వ్యతిరేకంగా పోరుబాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (పట్నంబజార్), ఏప్రిల్ 15: రాష్ట్రంలో విద్యారంగ పరిస్థితి దయనీయంగా మారిందని, ప్రభుత్వ ఎయిడెడ్, మునిసిపల్ పాఠశాలలతో పాటు సంక్షేమ హాస్టళ్లను మూసివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు జరుపుతోందని పిడిఎస్‌ఒ విద్యార్థిసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌కె బాజీ సైదా ఆరోపించారు. శనివారం జరిగిన కార్యకర్తల సమావేశంలో సైదా మాట్లాడుతూ జిల్లాలో 2015 సంవత్సరం నాటికి 95 ఎస్సీ హాస్టళ్లు ఉండగా, గత ఏడాది 30 హాస్టళ్లను మూసివేశారన్నారు. ఈనెల 12వ తేదీన మరో 28 హాస్టళ్లను 21వ తేదీలోగా మూసివేసి విద్యార్థులను జిల్లాలోని రెసిడెన్షియల్ కళాశాలలకు తరలించనున్నారని తెలిపారు. జిల్లాలో మిగిలేది 37 ఎస్సీ హాస్టళ్లేనని, బీసి, ఎస్టీ హాస్టళ్లను కూడా ఇదేరకంగా మూసివేతకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఇప్పటి వరకు రాష్టవ్య్రాప్తంగా 310 సంక్షేమ హాస్టళ్లను ప్రభుత్వం మూసేసిందని, మండలానికి అదనంగా రెసిడెన్షియల్ స్కూళ్లను, హాస్టళ్లను ఏర్పాటు చేయకపోగా పేద విద్యార్థులకు విద్యను దూరం చేయటం అమానుషమన్నారు. హాస్టళ్ల మూసివేత వల్ల ఎస్సీ, ఎస్టీ, బిసి విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వ హాస్టళ్ల మూసివేతకు వ్యతిరేకంగా పిడిఎస్‌ఒ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తుందని స్పష్టం చేశారు. పిడిఎస్‌ఒ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.నాగబసవయ్య,కెవి రమణ మాట్లాడుతూ సంక్షేమ హాస్టళ్లలో వౌలిక వసతులు లేకపోయినా విద్యార్థులు చదువుకుంటున్నారని, వారికి అందాల్సిన దుస్తులతో పాటు నోటు పుస్తకాలు, ఇతర సామాగ్రిని కూడా సకాలంలో ప్రభుత్వం అందించటంలేదని ధ్వజమెత్తారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల నేపథ్యంలో అర్థాకలితో విద్యార్థులు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు ఇబ్బడిముబ్బడిగా అనుమతులిస్తూ విద్యా ప్రైవేటీకరణకు ప్రభుత్వం పరోక్షంగా దోహదపడుతోందని మండిపడ్డారు. సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు బి గురులింగం, షేక్ నాగూర్‌బాబు, జె బాజీ తదితరులు పాల్గొన్నారు.
పెరిగిన సిమెంట్ ధరలతో నిర్మాణరంగం కుదేలు
గుంటూరు (పట్నంబజార్), ఏప్రిల్ 15: సిమెంట్ ధరలను తగ్గించకుంటే భవన నిర్మాణ రంగం అపారంగా నష్టపోతుందని కాన్ఫడెరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) గౌరవ సలహాదారు ఆళ్ల శివారెడ్డి అన్నారు. శనివారం స్థానిక బ్రాడీపేటలోని ఓ కాన్ఫరెన్స్ హాలులో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌శాఖ రాష్ట్రంలోని 17 నగరాల్లో విస్తరించి 11 వందల మంది సభ్యులతో రియల్ ఎస్టేట్, బిల్డర్స్‌కు సంబంధించిన నిర్మాణ రంగంలో విశిష్ట సేవలందిస్తోందని తెలిపారు. అయితే ఇటీవల సిమెంట్ కంపెనీల యాజమాన్యాలు కుమ్మక్కయి ధరలు పెంచాయని దీనివల్ల కార్మికులతో పాటు వినియోగదారులపై కూడా అదనపు భారం పడిందన్నారు. గతంలో 240 రూపాయలు ఉండే సిమెంట్ ధరను కృత్రిమ కొరత సృష్టించి తయారీ దార్లు 390 రూపాయలకు పెంచటం దారుణమన్నారు. ప్రభుత్వం నుండి పలు రాయితీలు పొందుతున్న సిమెంట్ కంపెనీల యాజమాన్యాలు ప్రజలకు తక్కువ ధరకు ఇవ్వాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా లాభాపేక్షతో వ్యాపారం చేయటం సరికాదన్నారు. సిమెంట్ ధర పెంపు వల్ల ప్రభుత్వ పథకాలకు కూడా భారీగా ఖర్చవుతుందని వివరించారు. సమావేశంలో గుంటూరుశాఖ అధ్యక్షులు మద్ది నాగ ప్రసాద్, కార్యదర్శి ఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.