గుంటూరు

ఇక నెంబర్‌లేని వాహనాలు నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 15: జాతీయ రహదార్లలో నెంబరులేని వాహనాలను ఇకపై నిషేధిస్తున్నట్లు అర్బన్‌జిల్లా ఎస్‌పి సర్వశ్రేష్ట త్రిపాఠి స్పష్టం చేశారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలోని తన చాంబర్‌లో హైవే పెట్రోలింగ్‌పై ఎస్పీ సమీక్ష జరిపారు. నెంబరుప్లేట్‌లేని వాహనాలు, హెల్మెట్ ధరించని వాహన చోదకులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. హైవేలో దాబాలు, రెస్టారెంట్లలో వాచ్‌మెన్, సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకోవాలని, ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా సహకరించాలని నిర్వాహకులను కోరారు. నూతనంగా ప్రవేశపెట్టిన హైవే పెట్రోలింగ్ వాహనాలలో విధులు నిర్వర్తించే సబ్‌ఇన్‌స్పెక్టర్లు రహదార్లలో ప్రమాదాలు జరిగిన వెంటనే అక్కడికి చేరుకుని బాధితులకు సత్వర వైద్యసేవలందించేందుకు సహకరించాలని సూచించారు. అసాంఘిక శక్తులు, దొంగలు అలజడి సృష్టించి పరారయ్యే సమయంలో హైవే పెట్రోలింగ్ వాహనాలు, రక్షక్, బ్లూకోట్స్ సమష్టిగా స్పందించాలన్నారు. హ్యాండ్ సెట్స్ ద్వారా సమాచారాన్ని చేరవేయాలన్నారు. డిసిఆర్‌బి, ఎస్‌బి, పిసిఆర్‌లో పనిచేస్తున్న ప్రత్యేక అధికారులు కీలక సమయాల్లో హైవే పెట్రోల్, రక్షక్, బ్లూకోట్స్ సిబ్బందిని పర్యవేక్షించాలని ఆదేశించారు. సమీక్షా సమావేశానికి అర్బన్ అడిషనల్ ఎస్‌పి జె. భాస్కరరావు, డిఎస్‌పిలు కె శ్రీనివాసరావు, బీరం నాగేశ్వరరావు, సిఐలు శ్రీనివాసులురెడ్డి, వేమారెడ్డి, వెంకన్నచౌదరి తదితరులు హాజరయ్యారు.

టిడిపి నుంచి హరిబాబు సస్పెన్షన్
గుంటూరు (కొత్తపేట), ఏప్రిల్ 15: మంత్రుల పేరుతో దందా నిర్వహిస్తున్న మంగళగిరి తెలుగుయువత నాయకుడు పోలవరపు హరిబాబును పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, వినుకొండ ఎమ్మెల్యే జివి ఆంజనేయులు శనివారం ప్రకటించారు. అధికార పార్టీ నేతల పేర్లు చెప్పి నిరుద్యోగులకు ఉద్యోగాలిప్పిస్తామని లక్షలాది రూపాయలు వసూలు చేసిన హరిబాబును క్రమశిక్షణ చర్యల్లో భాగంగా పార్టీ నుంచి తొలగించారు. అతనిపై మంగళగిరి పట్టణ, రూరల్ పోలీసుస్టేషన్లలో పలు చీటింగ్‌కేసులు, ఎస్సీ, ఎస్టీ చట్టం కింద మరో కేసు నమోదు కావటంతో పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ప్రజలను మోసగించే ఎలాంటి వారికీ తమ పార్టీలో స్థానంలేదని జివి స్పష్టం చేశారు. అవినీతి, మోసాలకు పాల్పడే ఎంతటి వారినైనా ఉపేక్షించేదిలేదని తేల్చిచెప్పారు.

ఉండవల్లి సెంటర్‌లో మత్స్యకారుల ఆందోళన
తాడేపల్లి, ఏప్రిల్ 15: నవ్యాంధ్ర రాజధాని ముఖద్వారమైన ఉండవల్లిసెంటర్‌లో శనివారం మత్యకారులు ధర్నా నిర్వహించారు. గత నెల రోజులుగా తమ జీవన భృతికి ‘గండి’కొట్టందంటూ పోలకంపాడు మత్స్యకారులు అటు ప్రభుత్వ అధికారులు, అమాత్యులకు చేసుకున్న విన్నపాలు ఏ ఒక్కరి హృదయాన్ని కదిలించకపోవటంతో చివరికి ప్రతిపక్షాల మద్దతుతో మత్స్యకారులు ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ తరతరాలుగా కృష్ణానదిని జీవనాధారంగా చేసుకుని జీవిస్తున్న పేద మత్స్యకారులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం వారి సమస్యలు గాలికొదిలేయటం హేయమైన చర్య అన్నారు. మత్స్యకారులకు పడవల రేవు ఏర్పాటు చేయాలని లేకుంటే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాగా రాష్ట్ర మేథావుల సంఘం కన్వీనర్ తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ తమ కుటుంబాలకు అసరా కల్పించమని కోరిన మత్స్యకారుల సమస్యలపై కనీసం సంబంధిత శాఖామంత్రి కొల్లు రవీంద్ర సైతం దృష్టి (మిగతా 6 లో)
సారించకపోవటం ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. మత్స్యకారుల జీవనం నదులపై ఆధారపడియుంటుందని, అటువంటప్పుడు వారికి తక్షణమే పడవల రేవు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు సిహెచ్ బాబురావు, జొన్న శివశంకర్, దొంతిరెడ్డి వెంకటరెడ్డి, సిపిఐ నాయకులు కంచర్ల కాశయ్య, కాంగ్రెస్ నాయకులు గుండిమెడ జేమ్స్, వైసిపి నాయకులు ఓలేటి రాము, డేవిడ్‌రాజు, గోరేబాబు తదితరులు పాల్గొన్నారు. కాగా ఈకార్యక్రమంలో మత్స్యకార కుటుంబాలకు చెందిన మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.