గుంటూరు

ఆరోగ్యకరమైన సమాజం రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసరావుపేట, ఏప్రిల్ 15: సమాజంలో మార్పు రావాలని, ఆరోగ్యకరమైన సమాజం తయారు కావాలని స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు పిలుపునిచ్చారు. శనివారం పట్టణ శివారులో నూతనంగా పలు అభివృద్ది కార్యక్రమాలు నిర్వహించిన పరదైసు క్రైస్తవ సమాధుల తోట ప్రారంభోత్సవ సభలో మాట్లాడారు. ఈ సభకు రెవరెండ్ ఫాస్టర్ ఎలిషా మున్నంగి అధ్యక్షత వహించారు. కులం, మతం, ప్రాంతంతో తనకు సంబంధం లేదని, అభివృద్దే తన లక్ష్యమని అన్నారు. తాను చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆనాడు ఎన్టీఆర్, ఈనాడు చంద్రబాబునాయుడు పూర్తిగా సహకరిస్తున్నారని అన్నారు. సామాజిక కార్యక్రమాలే తప్ప రాజకీయ కార్యక్రమాలు ప్రస్తుతం అవసరం లేదని స్పష్టం చేశారు. నాకు భవగవంతుని దీవెనలతో మంచి అవకాశాలు వచ్చాయి, ఆ అవకాశాలను ప్రజలకు వినియోగిస్తానని వివరించారు. దళితులు కమ్యూనిటీ హాల్ కావాలని అడుగుతున్నారని, అందుకు అవసరమైన 40సెంట్లు స్ధలాన్ని రెవెన్యూ అధికారులు డాలని అక్కడే ఉన్న రెవెన్యూ అధికారులను స్పీకర్ ఆదేశించారు. స్ధలం ఉంటే తన నిధుల్లో 50 లక్షల రూపాయలు ఇస్తానని, మున్సిపాలిటీ నుండి మరో 50 లక్షల రూపాయలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అయితే దళిత సమాజంలోని ప్రతి ఒక్క పిల్లాడు బడికి వెళ్ళాలని కోరారు. మరుగుదొడ్డి, ఇంకుడుగుంటలు, చెట్లు పెంచడం, పరిశుభ్రత వంటి వాటిని ప్రచారం చేయడంతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించాలని స్పీకర్ కోడెల కోరారు. రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ స్పీకర్ కోడెల అభివృద్ధికి ఐకాన్ అని కొనియాడారు. నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో స్మశానాలను దేవాలయాలుగా మార్చిన ఘనత కోడెలకే దక్కుతుందని అన్నారు. ఒక్కో స్మశానం అభివృద్ధికి ప్రభుత్వం పది లక్షల రూపాయలు కేటాయించిందని అన్నారు. తన మంత్రి పదవి రావడానికి పూర్తిగా సహకరించిన వ్యక్తి కోడెల అని అన్నారు. తన శాఖలో దళితులకు చేయాల్సిన వన్నీ చేస్తానని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అన్నారు. ఎస్సీ కాలనీల్లో రోడ్లు, కమ్యూనిటీ హాల్స్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో గంధం రవీందర్, తహశీల్దార్ విజయజ్యోతి కుమారి, కమీషనర్ భానూప్రసాద్,డిఎస్పీ కె నాగేశ్వరరావు, ఎంపీపీలు కొమ్మాలపాటి ప్రభాకర్, మొండితోక రామారావు, కొట్టా కిరణ్, శీలు బాబురావు, సాల్మన్ రాజు, దాసరి నాగయ్య తదితరులు పాల్గొన్నారు.
తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో
ఇంకుడు గుంట ప్రారంభం
స్ధానిక తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో శనివారం ఇంకుడు గుంటలను స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు, రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖామంత్రి నక్కా ఆనందబాబు ప్రారంభించారు. ఇంకుడు గుంతలను ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఏర్పాటు చేసుకోవాలని వారు సూచించారు. అదే విధంగా వేసవి తాపాన్ని తీర్చేందుకు మంచినీటి చలివేంద్రాలను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలని వారు చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలకు వివిధ పనుల కోసం గ్రామాల నుండి ప్రజలు వస్తుంటారని, వారి దహార్తిని తీర్చేందుకు ఈ చలివేంద్రాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో స్పీకర్ కోడెల, మంత్రి నక్కా ఆనందబాబు మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో గంధం రవీందర్, తహశీల్దార్ విజయజ్యోతి కుమారి, వివిధ శాఖల అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రజాపంపిణీ వ్యవస్థలోఅక్రమాలు సహించం
* మంత్రి ప్రత్తిపాటి

గుంటూరు, ఏప్రిల్ 15: రేషన్ దుకాణాలలో బయోమెట్రిక్ విధానంలో అవకతవకలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎలాంటి అక్రమాలు జరిగినా ఉపేక్షించేదిలేదని పౌరసరఫరాలశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు. శనివారం నగరంలోని రేషన్ దుకాణాలలో ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అర్హులైన వారికి రేషన్ అందించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని షాపులలో బయోమెట్రిక్ తప్పనిసరన్నారు. రేషన్ పంపిణీపై లబ్దిదారులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెలా ఒకటి నుంచి 15వ తేదీ వరకు నిర్ణీత వేళల్లో నిత్యావసరాలను అందించాలని డీలర్లను ఆదేశించారు. డీలర్లు అవకతవకలకు పాల్పడితే డీలర్‌షిప్ రద్దుచేసేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. జిల్లాలో మంగళ, బుధవారాల్లో పర్యటించి రేషన్ తీసుకోని లబ్ధిదారుల నుంచి వివరాలు సేకరిస్తామన్నారు. ఈ పోసు యంత్రాల పనితీరుపై జెసి కృత్తికాశుక్లా సమీక్షించారు. కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి, ఎమ్మెల్సీ ఎఎస్ రామకృష్ణ, ఏఎంసి చైర్మన్ మన్నవ సుబ్బారావు, డిఎస్‌ఒ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.