గుంటూరు

సత్తెనపల్లి సబ్ కోర్టులో నిందితుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్తెనపల్లి, మే 15:గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని సబ్ కోర్టులో వాయిదాకు వచ్చిన నిందితుడు కావూరి యేసు (35) గుండెపోటుతో కోర్టు ఆవరణలో ఒక్కసారిగా కుప్పకూలి మృతిచెందిన సంఘటన సోమవారం జరిగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం పెదకూరపాడు మండలం పాటిబండ్ల గ్రామానికి చెందిన యేసు 2014వ సంవత్సరంలో జరిగిన కిడ్నాప్, అత్యాచారం కేసులో ఎ-2 ముద్దాయిగా వున్నాడు. అయితే ఈ కేసులో వాయిదాకు వచ్చి వాయిదా ముగించుకొని కోర్టు మెట్లు దిగుతూ గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడాని తెలిపారు. స్థానిక మార్కెట్ యార్డు ఆవరణలోవున్న సబ్ కోర్టు వద్ద ఈ ఘటనతో తోటి ముద్దాయిలు సైతం ఒక్కసారిగా ఉలికిపాటుకు గురయ్యారు. కుప్పకూలిపోయిన యేసును హుటాహుటిన అక్కడి వారు 108ని పిలిపించి స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య
ప్రత్తిపాడు, మే 15: అప్పుల బాధ తాళలేక ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల కేంద్రమైన ప్రత్తిపాడులో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... ప్రత్తిపాడు వైఎస్‌ఆర్ కాలనీలో నివాసముంటున్న పిట్టమళ్ల వెంకటేష్ (24) స్వస్థలం వినుకొండ అయినప్పటికీ గత 15 సంవత్సరాలుగా ప్రత్తిపాడులోనే నివాసముంటున్నాడు. అయితే ఇంటిస్థలాన్ని కుదువబెట్టి అప్పు చేసి, తీర్చేదారి లేక ఒత్తిడికి గురై ఇంటిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ప్రత్తిపాడు ఎస్‌ఐ శ్రీనివాసరావు తెలిపారు.
మహిళ మెడలో గొలుసు చోరీకి విఫలయత్నం
మంగళగిరి, మే 15: పట్టణంలోని ఎపిఎస్‌పి బెటాలియన్ సమీపాన సోమవారం ఉదయం ఇంటిముందు ముగ్గు వేస్తున్న లక్ష్మి అనే మహిళ మెడలోని బంగారు గొలుసును లాక్కుని వెళ్లేందుకు గుర్తుతెలియని యువకుడు విఫలయత్నంచేశాడు. ముగ్గురు యువకులు మోటారుబైక్‌పై వచ్చి అందులో ఒక యువకుడు ముగ్గేస్తున్న లక్ష్మి మెడలో ఉన్న గొలుసును లాగేందుకు ప్రయత్నించగా ఆమె ప్రతిఘటించి కేకలు వేసింది. సమీపంలో ఉన్న కొందరు గమనించడంతో లక్ష్మి మెడలో గొలుసు వదిలేసి ముగ్గురు యువకులు మోటారు సైకిల్‌పై పరారయ్యారు. పట్టణ సిఐ బ్రహ్మయ్య సంఘటనా స్థలాన్ని సందర్శించి జరిగిన సంఘటన గురించి లక్ష్మిని అడిగి తెలుసుకున్నారు.

క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
గుంటూరు (పట్నంబజారు), మే 15: నగరంలో క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న ఓ ముఠాను పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం జిల్లా అర్బన్ పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఎఎస్‌పి జె భాస్కరరావు బెట్టింగ్ నిర్వాహకుల వివరాలను వెల్లడించారు. బ్రాడీపేట 1/20 పాత కంకరగుంట గేటు సమీపంలో ఓ పరుపులు, దిండ్లు అమ్మే షాపులో ఐపిఎల్ మ్యాచ్‌ల నేపథ్యంలో కంభంపాడు గ్రామానికి చెందిన బాలాజీ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నాడు. అతనికి సాయంగా తూమాటి శ్రీనివాసరావు, బాలాజీకి లైన్ ఫోన్ ద్వారా బెట్టింగ్ ఆడేందుకు 2 లక్షల రూపాయలు డిపాజిట్ పెట్టాడు. అతనితో పాటు చావా నారాయణరావు, షేక్ అబ్దుల్ రహీమ్, షేక్ బాషా, షేక్ మొబీన్, మంచాల శేఖర్, తెనాలి రవికుమార్, జి శ్రీనివాసులు, బెట్టింగ్‌ల నిమిత్తం 62 వేల రూపాయలు వసూలు చేసుకున్నారు. మొత్తం నిందితుల నుండి రెండు సెల్‌ఫోన్లు, 2,62,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు భాస్కరరావు తెలిపారు. నిందితుల అరెస్ట్‌లో ప్రతిభ కనబర్చిన అధికారులు, సిబ్బందిని అభినందించారు.