గుంటూరు

రహదారుల ఆక్రమణలను తక్షణం తొలగించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మే 15: నగరంలోని ప్రధాన రహదారులతో పాటు చిన్న చిన్న రోడ్లను ఆక్రమించుకుంటున్న వారికి నోటీసులు జారీచేసి, తక్షణం వాటిని తొలగించేలా చూడాలని అధికారులకు నగరపాలక సంస్థ కమిషనర్ అనూరాధ ఆదేశాలు జారీచేశారు. సోమవారం శ్రీనగర్, కాకుమానువారితోట, వసంతరాయపురం, సంజీవయ్యనగర్, నెహ్రూనగర్, పెదకాకాని రోడ్డు తదితర ప్రాంతాల్లో విస్తృతంగా ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా పలు చోట్ల చెత్తకుప్పలు, రోడ్లపైనే ఆవులను కట్టివేయడం, షెడ్లు నిర్మించి ఉండటాన్ని గమనించిన కమిషనర్ అధికారులను ప్రశ్నించారు. షెడ్ల నిర్మాణం, ఆవులు, పశువుల పెంపకం కారణంగా సైడ్ కాల్వలు పూడుకుపోయి, వ్యర్ధాలు రోడ్లపైకి చేరుతున్నాయని, తక్షణం ఆక్రమణలను తొలగించాలని సూచించారు. ఆవులు, పశువులను వాటి యజమానుల తమ ఇళ్ల పరిసరాల్లోనే కట్టివేసుకోవాలని, రోడ్లపైకి వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పలు ప్రాంతాల్లో డ్రైన్లు పూడుకుపోయి, ఎక్కడబడితే అక్కడ చెత్తకుప్పలు దర్శనమివ్వడంపై కమిషనర్ అసంతృప్తి వ్యక్తంచేశారు. చిన్న చిన్న బంకులు, బడ్డీకొట్ల యజమానులు డస్ట్‌బిన్‌లను ఏర్పాటుచేసుకుని, వ్యర్ధాలను వాటిలోనే వేయాలన్నారు. తదుపరి పరిశీలనకు వచ్చినప్పుడే వ్యర్ధాలు సైడ్‌కాల్వల్లో కనిపిస్తే సంబంధిత వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతిరోజు పారిశుద్ధ్య సిబ్బంది తమకు కేటాయించిన ప్రాంతాల్లో పర్యటించాలని, డోర్ టు డోర్ చెత్త సేకరణ చేపట్టాలని స్పష్టంచేశారు. కార్యక్రమంలో పలువురు శానిటరీ ఇన్స్‌పెక్టర్లు, ఇంజనీరింగ్ అధికారులు, బిల్డింగ్ ఇన్స్‌పెక్టర్లు ఉన్నారు.

విధుల్లో అలక్ష్యం వహిస్తే చర్యలు
గుంటూరు, మే 15: విధుల్లో అలసత్వం, నిర్లక్ష్యం వహిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మన్నవ సుబ్బారావు స్పష్టంచేశారు. సోమవారం మార్కెట్‌యార్డులో ఎగుమతిదారులు, దిగుమతిదారులు, దొడ్డికాపల, రాత్రి దిగుమతి కూలీలు, బల్ల రిక్షా తోలకం యూనియన్ నాయకులు, యార్డు హమాలీల యూనియన్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ యార్డులో జెఎంఎన్ రాజశేఖర్ డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, తోటి సిబ్బందిపై కూడా దాడులు చేస్తున్నట్లు తెలియడంతో అతన్ని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. మంగళవారం నుండి యార్డుకు సెలవులు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. జూన్ 5వ తేదీన తిరిగి యార్డు తెరిచే వరకూ ఎవరూ సరుకు తీసుకురావద్దని సూచించారు. చంద్రన్న రైతు రాయితీ పథకం ప్రారంభమైన తర్వాత పెద్ద ఎత్తున రైతాంగం తమ సరుకుతో యార్డుకు రావడంతో కొంత భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తాయని, పోలీసు, భద్రత సిబ్బంది సమర్ధవంతంగా వ్యవహరిస్తున్నారన్నారు. అగ్నిమాపక శాఖ వారు 50 మంది సిబ్బందితో సిద్ధంగా ఉన్నారన్నారు. యార్డుల సంక్షేమం, రైతాంగ సమస్యలు, వౌళిక సదుపాయాలు, వసతుల కల్పన తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో ఎజెసి ముంగా వెంకటేశ్వరరావు, డి ఎస్‌పి శ్రీనివాసరావు, యార్డు వైస్ చైర్మన్ కొత్తూరి వెంకట్, డైరెక్టర్లు ఎస్‌ఎస్‌పి జాదా, బాణావత్ రాజీ, షేక్ చినబాజీ, మన్నవ వెంకటేశ్వరరావు, ఎగుమతి, దిగుమతిదారులు, హమాలీ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.