గుంటూరు

అగ్రిగోల్డ్ బాధితులకు అండ: ముప్పాళ్ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, అక్టోబర్ 17: అగ్రిగోల్డ్ బాధితులందరికీ న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం స్థానిక పోలీసుస్టేషనులో అగ్రిగోల్డ్ బాధితుల వివరాలు నమోదును ఆయన పరిశీలించి పోలీసు అధికారులతోను, బాధితులతోను ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ముప్పాళ్ల విలేఖర్లతో మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితుల వివరాల నమోదులో ఏర్పరిచిన ఇబ్బందులను రాష్ట్ర డీజీపి నండూరి సాంబశివరావు దృష్టికి తీసుకెళ్లి సమస్యలు తలెత్తకుండా వివరాలు నమోదు చేసే విధంగా ఆదేశాలు ఇచ్చే విధంగా చేశామన్నారు. పేర్ల నమోదులో ఏ ఒక్క బాధితుడికి అన్యాయం జరగకుండా రశీదు లేకపోయినా రిమార్క్స్‌లో నమోదు చేసేందుకు అంగీకరించారని, ఇక్కడ పేరు నమోదు కాగానే డబ్బులొచ్చినట్లుగా భావించరాదని, ఎస్సెల్ గ్రూప్ కంపెనీ అగ్రిగోల్డ్ సంస్థను టేకోవర్ ఏసేందుకు ముందుకొచ్చిందని, రెండు వారాల గడువు కోరారని, సంస్థ ఆస్తులు పరిశీలన జరుపుతున్నారని, అగ్రిగోల్డ్ సంస్థ కస్టమర్లను మోసగించినట్లు భవిష్యత్తులో ఎస్సెల్ కంపెనీ బాధితులుగా వీరు మిగలకూడదని ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముప్పాళ్ల అన్నారు. రాష్ట్రంలో అగ్రిగోల్డ్ సంస్థ ఖాతాదారులకు చెల్లించాల్సిన 3,965 కోట్ల 70 లక్షల రూపాయలకు ప్రభుత్వం హామీగా ఉండాలని తమ పోరాట ఫలితంగా అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులు అమ్ముకోకుండా అడ్డుకున్నామని చెప్పారు. అగ్రిగోల్డ్ బాధితుల పేర్లు నమోదు పారదర్శకంగా జరుగుతుందనే నమ్మకం ఉందని, పోలీసు డిపార్ట్‌మెంట్ కానీ, సిఐడి కానీ మోసం చేయదనే భావిస్తున్నామని ఆయనన్నారు. సిపిఐ పట్టణ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, నియోజకవర్గ సిపిఐ సహాయ కార్యదర్శులు పిల్లలమర్రి నాగేశ్వరరావు, కంచర్ల కాశయ్య, కౌన్సిలర్ సత్యనారాయణ, మున్సిపల్ వైస్‌చైర్మన్ నందం బ్రహ్మేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక ఇబ్బందులున్నా అభివృద్ధిలో ముందున్నాం
రొంపిచర్ల, అక్టోబర్ 17: రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ అభివృద్ధిలో ముందుందని స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. మండలంలోని గోగులపాడు గ్రామంలో మంగళవారం ఆయన పర్యటించారు. రూ.4.40 కోట్ల విలువ గల పలు కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడవ విడత రుణమాఫీ కింద గ్రామంలోని రైతులకు రూ.3.14 కోట్ల రూపాయలను అందించనున్నట్లు చెప్పారు. గ్రామంలో మూడున్నరేళ్లలో 10.65 కోట్ల రూపాయల విలువ గల పనులు చేశామన్నారు. కోటిన్నర రూపాయలతో ఎన్‌టి ఆర్ గృహనిర్మాణం, 3.14 కోట్ల విలువ గల రుణమాఫీ, 30 లక్షల సబ్సీడి రుణాలు, 45 లక్షల వ్యయంతో 5 అంగన్‌వాడీ కేంద్రాలు, 2.8 కోట్ల విలువ గల సిసి రోడ్లు, 26 లక్షల విలువ గల ఉపాధి హామీ పనులు, 135 మందికి గ్యాస్ కనెక్షన్లు అందించామన్నారు. గత మూడున్నరేళ్లుగా రాష్ట్భ్రావృద్ధికి సిఎం చంద్రబాబు నాయుడు విశేష కృషి చేస్తున్నారన్నారు. ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని కోరారు. తొలుత పాఠశాలను సందర్శించిన స్పీకర్ కోడెల రాష్టస్థ్రాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన విద్యార్థులను అభినందించారు. ఈయన వెంట ఎంపిపి మొండితోక రామారావు, మాజీ యార్డు చైర్మన్ మెట్టు వెంకటేశ్వరరెడ్డి, ఎండిఒ కె మాథ్యూబాబు, తహశీల్దార్ కె నాసరయ్య తదితరులు పాల్గొన్నారు.