గుంటూరు

రోడ్డు ప్రమాదాలపై సంపూర్ణ అవగాహన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 17: జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు సంపూర్ణ అవగాహన కలిగించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని డిఆర్‌సి సమావేశ మందిరంలో జరిగిన జిల్లా స్థాయి రహదారి భద్రతా సమావేశంలో రహదారుల ప్రమాదాల నివారణకు, భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. రహదారుల విస్తరణలో భాగంగా నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ పనులను త్వరితగతిన పూర్తిచేసి నగరంలోని ప్రధాన రహదారుల విస్తరణకు చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తూ ద్విచక్ర వాహనాలు కలిగి ఉన్న ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా హెల్మెట్‌ను ధరించాలన్నారు. కళాశాల విద్యార్థులు కూడా హెల్మెట్ ధరించేలా యాజమాన్యాలు సూచనలు జారీచేయాలన్నారు. అనంతరం మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల్లో రహదారి భద్రత పట్ల అవగాహన కల్గించేందుకు అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. నగరంలో గానీ, గ్రామీణ ప్రాంతాల్లో గానీ ఎక్కడ ప్రమాద సంఘటనలు జరిగాయో అక్కడ సూచికలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించామన్నారు. ఇటీవల నగరంలో చేపట్టిన హెల్మెట్ వాడకం విజయవంతమైందని, 40 శాతం మంది వినియోగిస్తున్నారన్నారు. నగరంలో చేపట్టనున్న రహదారి భద్రతా పనులకు అవసరమైన నిధులు తక్షణమే మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఇకపై ప్రతి నెలా మూడవ మంగళవారం రహదారి భద్రతా సమావేశం జరిపి ఎప్పటికప్పుడు అభివృద్ధిపై చర్చిస్తామని చెప్పారు. ప్రజలు ప్రభుత్వం నుండి మెరుగైన సేవలు కోరుకుంటున్నారని, అందులో భాగంగా నగరంలో ఆర్టీసీకి చెందిన బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. గుంటూరు అర్బన్, రూరల్ ఎస్‌పిలు సిహెచ్ విజయారావు, సిహెచ్ వెంకటప్పల నాయుడు జిల్లాలో రహదారి భద్రతకు, ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. జిల్లా ఉప రవాణా కమిషనర్ రాజారత్నం జిల్లాలో జరుగుతున్న రహదారి ప్రమాదాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. 2016 ఆగస్టు నెలలో జిల్లాలో 206 ప్రమాదాలు జరిగి 102 మంది మృతిచెందగా, 2017 ఆగస్టు నెలలో 217 ప్రమాదాలు జరగ్గా 62 మంది మృతిచెందినట్లు తెలిపారు. 2016 సెప్టెంబర్ నెలలో 153 ప్రమాదాలు జరిగి 63 మంది మరణించారని, ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో 195 ప్రమాదాలు జరుగగా 74 మంది మృత్యువాత పడ్డారని తెలిపారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనూరాధ, పోలీసు, రెవెన్యూ, వైద్య, ఆరోగ్య, పౌరసరఫరాలు, ఆర్‌అండ్‌బి, పంచాయతీరాజ్, భారత జాతీయ రహదారుల సంస్థ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.