గుంటూరు

కిటకిటలాడిన బ్యాంకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెదకూరపాడు, అక్టోబర్ 17: మూడో విడత రుణమాఫీ రైతులతో మండలంలోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, 75 తాళ్లూరు ఆంధ్రాబ్యాంకు, పాటిబండ్ల కార్పొరేషన్ బ్యాంకులు మంగళవారం కిటకిటలాడాయి. రెండు విడతలుగా రుణమాఫీ పొందిన రైతులు మూడో విడత రుణమాఫీ పొందేందుకు తమ వద్ద ఉన్న ఆధారిత పత్రాలతో బ్యాంకుకు వెళ్లి తమ తమ ఖాతాలను రుణమాఫీ నగదును జమ చేయుటకు బారులు తీరారు. గతంలో వ్యవసాయ శాఖ వారు రైతులకు ఇచ్చిన రుణ ఉపశమన పత్రాలను బ్యాంకు అధికారులు పరిశీలించి ధ్రువీకరిస్తున్నారు. బ్యాంకు అధికారులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండి రైతులకు సహకరించడం పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పోలీసు సిబ్బంది రక్తదానం

మంగళగిరి, అక్టోబర్ 17: పోలీసు సిబ్బంది రక్తదానం చేయడం అభినందనీయమని రాష్ట్ర డీజీపి నండూరి సాంబశివరావు అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం మంగళగిరిలోని ఎపిఎస్‌పి ఆరో బెటాలియన్‌లో రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి విలేఖర్లతో మాట్లాడారు. డీజీపి సాంబశివరావు మాట్లాడుతూ ప్రతి ఏడాది పోలీసు సిబ్బందికి వైద్య పరీక్షల కోసం 4.76 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని, పోలీసు సంక్షేమానికి ఏటా 15 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. సిబ్బందికి నివాస యోగ్యమైన క్వార్టర్స్ లేకపోవడంతో అద్దె ఇళ్లల్లో నివాసం ఉంటూ ఇబ్బందులు పడుతున్నారని, క్వార్టర్స్ నిర్మాణానికి రెండు రకాల పధకాలు అమలు చేసే యోచన పరిశీలనలో ఉందని, సర్వీసులో ఉన్న పోలీసులకు ఉచిత నివాసం, సిబ్బంది సొంతంగా ఉండటానికి గేటెడ్ తరహా ఇళ్లు నిర్మిస్తామని, దీనిపై ముఖ్యమంత్రి, హోంమంత్రి, పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్లతో చర్చించడం జరిగిందని, రాష్ట్రంలో పోలీసు సిబ్బంది కొరత లేదని డీజీపి అన్నారు. గతంలో 20-30 మంది పోలీసు సిబ్బంది చేసే పనిని నేడు కేవలం ఇద్దరు ముగ్గురు సిబ్బందే కష్టపడి చేస్తున్నారని అన్నారు. బెటాలియన్ కమాండెంట్ శ్రీరామమూర్తి, సిబ్బంది రక్తదానం చేశారు.