గుంటూరు

మోడల్ పోలీసుస్టేషన్ పనులను పరిశీలించిన ఎస్పీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేబ్రోలు, డిసెంబర్ 11: చేబ్రోలు సర్కిల్ పోలీసుస్టేషన్‌లో సుమారు 1.13 కోట్ల రూపాయలతో నిర్మితమవుతున్న మోడల్ పోలీసుస్టేషన్ నిర్మాణ పనులను అర్బన్ ఎస్‌పి సిహెచ్ విజయారావు సోమవారం పరిశీలించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని కాంట్రాక్టర్‌ను హెచ్చరించారు. నాణ్యత లేకుండా పోలీసుస్టేషన్ నిర్మాణ పనులు జరుగుతుండటంతో గతంలో రెండుసార్లు ఎస్‌పి విజయారావు కాంట్రాక్టర్‌ను హెచ్చరించిన విషయం తెలిసిందే. నిబంధనల మేరకు నిర్మాణ పనులు నిర్వహించాలని సూచించారు. ఈయన వెంట చేబ్రోలు సిఐ జి రవికుమార్, ఎస్‌ఐ బాబురావు ఉన్నారు.
ఆటోబోల్తా - పలువురికి గాయాలు
అచ్చంపేట, డిసెంబర్ 11: మండల పరిధిలోని అచ్చంపేటలో గల ఎరుసలేం ప్రార్థనా మందిరం దగ్గర ఆటోబోల్తా పడి అందులో ప్రయాణిస్తున్న పలువురికి సోమవారం గాయాలయ్యాయి. కృష్ణాజిల్లా, చందర్లపాడు మండలం, తోటరావులపాడుకు చెందిన మనె్నం చినబసవయ్య, సమీర్లమ్మ మరికొందరు క్రోసూరులో ఆటో ఎక్కి అచ్చంపేట వస్తూ పెద్దపాలెం రోడ్డు నుంచి వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి ప్రమాదవశాత్తు బోల్తాపడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఎం ఎమీల్యమ్మతో పాటు మరికొందరికి గాయాలయ్యాయి. వీరందరినీ 108 ప్రాణదాత వాహనం ద్వారా సత్తెనపల్లికి తరలించారు. ప్రమాదానికి కారణమైన ద్విచక్ర వాహనదారుడు పరారీలో ఉన్నాడు. అచ్చంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రూ.60 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
మంగళగిరి, డిసెంబర్ 11: పురపాలక సంఘం పరిధిలోని 28వ వార్డు నీరుకొండ దళిత శిబిరంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు సుమారు 60 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించ తలపెట్టిన సిమెంటురోడ్డుకు, మున్సిపల్ ప్రాధమిక పాఠశాల ప్రహరీగోడ నిర్మాణానికి సోమవారం మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి, శంకుస్థాపన గావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో పేదలు, దళితులు, బడుగు బలహీన వర్గాలు నివాసం ఉండే ప్రాంతాల్లో వౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత నిస్తున్నామన్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలని, అధికారులను ఆయన ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ ఎన్‌వి నాగేశ్వరరావు, డీఈఈ పి ఏడుకొండలు, ఏఈఈ వెంకటరామన్, మున్సిపల్ కౌన్సిలర్లు కొమ్మారెడ్డి సుబ్రహ్మణ్యం, బట్టు చిదానంద శాస్ర్తీ, మునగాల సత్యనారాయణ, మండ్రు రాము, మాజీకౌన్సిలర్ దిడ్ల సత్యానందం తదితరులు పాల్గొన్నారు.