గుంటూరు

క్రీడాకారులను ప్రోత్సహించాలి:చైర్మన్ గంజి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, డిసెంబర్ 11: చదువుతో పాటు వివిధ క్రీడల్లో రాణించే ప్రతిభ ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి అన్నారు. ఈ నెల 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు కేరళ రాష్ట్రంలోని అలెప్పీలో జరిగిన ఏషియన్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో మంగళగిరికి చెందిన క్రీడాకారిణి సాదియా అల్మాస్ మూడు కాంస్యపతకాలు గెల్చుకున్న సందర్భంగా సోమవారం పట్టణంలో విద్యార్ధులు, క్రీడాకారులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో విజేత సాదియా అల్మాస్, ఇటీవల కామన్‌వెల్స్ క్రీడల్లో పతకాలు సాధించిన పవర్ లిఫ్టర్ చంద్రికలకు అభినందన సభ నిర్వహించారు. సభకు అధ్యక్షత వహించిన గంజి చిరంజీవి విజేతలను అభినందించారు. వేదికపై సాదియా అల్మాస్, చంద్రికలను ఘనంగా సత్కరించారు. కోచ్ ఎస్‌ఎం సంధాని, పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రఫి, గుమ్మడి పుల్లేశ్వరరావు, నాన్ పొలిటికల్ జెఎసి కన్వీనర్ అప్పికట్ల శ్రీహరినాయుడు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు నల్లగొర్ల శ్రీనివాస్, సత్యనారాయణ, గోలి నాగశ్రీనివాస్, బట్టు చిదానంద శాస్ర్తీ, మునగాల సత్యనారాయణ, మండ్రు రాము, మున్సిపల్ డీఈఈ పి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.
పట్టుదల ఉంటే సాధించలేనిది లేదు

గుంటూరు, డిసెంబర్ 11: పట్టుదల మెండుగా ఉండి, గుండెనిండా ఆత్మవిశ్వాసాన్ని నింపుకుని అంకితభావంతో కృషిచేస్తే సాధించలేనిది ఏదీ ఉండదని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ శశిధర్ బిటెక్ చివరి సంవత్సరం చదువుతూ 101 వెబ్‌సైట్స్‌ను రూపొందించిన నర్సరావుపేట మండలం, పెట్లూరివారిపాలెంకు చెందిన రజితను ఘనంగా సత్కరించి, జ్ఞాపిక, షీల్డు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లో బాలికా విద్యను భారంగా భావిస్తూ బాల్య వివాహాలు చేస్తున్నారని, వారికి కొంత ప్రోత్సాహం అందజేస్తే అద్భుతమైన ఫలితాలు రాబడతారని తెలిపారు. నేటి సమాజంలో విద్యార్థినులు, మహిళలు ఎక్కడ, ఏ రంగంలో ఉన్నా అనుకున్న లక్ష్యాలను సాధించడంలో ముందు వరుసలో నిలుస్తున్నారని హర్షం వ్యక్తంచేశారు. ఇటీవలే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన విద్యార్థులను సత్కరించామని, తాజాగా సాంకేతిక రంగంలో ఉత్తమ నైపుణ్యాన్ని ప్రదర్శించిన రజితను సత్కరించడం జిల్లాకే గర్వకారణంగా పేర్కొన్నారు. ఏ సమస్యనైనా సాంకేతిక విద్యతోనే పరిష్కరించుకోవచ్చని, ఇందుకు సంబంధించి ఒక సామాజిక సమస్యను ఆయా కళాశాలల్లోని విద్యార్థులకు ఇచ్చి వాటి పరిష్కారానికి కృషిచేయాల్సిన అవసరం ఉందన్నారు. సత్కార గ్రహీత రజిత మాట్లాడుతూ తాను 101 వెబ్‌సైట్‌లు రూపొందించడంలో చక్కటి ప్రోత్సాహం అందించిన తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యానికి, సహకరించిన తోటి విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జెసి క్రితికాశుక్లా, జెసి-2 ముంగా వెంకటేశ్వరరావు, డిఆర్‌ఒ కొసనా నాగబాబు, రాజీవ్‌విద్యా మిషన్ ప్రాజెక్టు అధికారిణి వెంకట సత్యవతి, రజిత తల్లిదండ్రులు పాల్గొన్నారు.