గుంటూరు

యడ్లపాడులో గాలివాన బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యడ్లపాడు, మే 6: మండలంలో శుక్రవారం ఉదయం కురిసిన గాలివాన పలు గ్రామాల్లో బీభత్సం సృష్టించింది. సుమారు 2 గంటల పాటు పెను గాలులతో కూడిన వర్షం కురిసింది. యడ్లపాడు, ఉప్పరపాలెం, బోయపాలెం, గోపాలపురం, కొండవీడు గ్రామాల్లోని మామిడితోటల్లో కాపు పెనుగాలులకు భారీగా రాలిపోయింది. తిమ్మాపురం, మైదవోలు, లింగారావుపాలెం, కారుచోల గ్రామాల్లో విద్యుత్ తీగలు తెగిపోవడంతో ఆ గ్రామాలకే కాక పలు గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయమేర్పడింది. బోయపాలెంలో విద్యుత్ స్తంభాలు విరిగి పడిపోవడంతో విద్యుత్‌శాఖ శుక్రవారం మధ్యాహ్నం వరకు శ్రమించి పునరుద్ధరించాల్సి వచ్చింది. వంకాయలపాడు ఉన్నవ గ్రామాల నడుమ మూడు ఇళ్లపై రేకులు పెనుగాలులకు లేచిపోయాయి. గత రెండు రోజులుగా మండలంలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రభుత్వం తమకు తగు రీతిలో సాయం అందించాలని మామిడితోటల రైతులు కోరుతున్నారు.