గుంటూరు

నిత్య కృషీవలుడు పాటిబండ్ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కల్చరల్), జనవరి 5: పడమటి గాలి లాంటి ఓ గొప్ప సందేశాత్మక సాంఘిక నాటకాన్ని అందించి, ఆంధ్రనాటక రంగంలో చరిత్ర సృష్టించిన ప్రముఖ రచయిత, నటుడు పాటిబండ్ల ఆనందరావు నాటక ప్రపంచాన నిత్య కృషీవలుడని పలువురు కళారంగ ప్రముఖులు ఆయనపై ప్రశంసల జల్లులు కురిపించారు. శుక్రవారం రాత్రి నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో అజోవిభో కందాళం ఫౌండేషన్ రజతోత్సవాల్లో భాగంగా పాటిబండ్ల ఆనందరావుకు సరిలేరు నీకెవ్వరు... విశిష్ఠ రంగస్థల పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు రాష్ట్ర ప్రణాళికా సంఘ సభ్యుడు డాక్టర్ పెద్ది రామారావు అధ్యక్షత వహించారు. అతిథులుగా విచ్చేసిన విశ్రాంత ఐఎఎస్ అధికారి గుమ్మళ్ల బలరామయ్య, ప్రజానాట్య మండలి నేత నల్లూరి వెంకటేశ్వర్లు, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ శ్రీపతి రాముడు, అరసం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ సాకం నాగరాజు, యుఎస్‌ఎ నుంచి వచ్చిన డాక్టర్ భాస్కర్ హనుమత్ కొంపెల్ల తదితర ప్రముఖులు సమాజాన్ని పూర్తిగా అవలోకనం చేసి పాటిబండ్ల ఎన్నో నాటికలను రచించారన్నారు. వీటిలో ప్రధానంగా పడమటి గాలి నాటిక ఓ వినూత్నమైన ఒరవడిలో సాగి నాటక రంగంలోనే కొత్త వైవిద్యాన్ని సంతరించుకుందన్నారు. ప్రపంచీకరణ వల్ల రాబోయే ప్రమాదాలను 1998లోనే ఊహించి సంఘానికి ఓ మేలుకొలుపు ఆనందరావు పలికారని వక్తలంతా కొనియాడారు. కన్యాశుల్కం నాటిక తర్వాత అదేస్థాయిలో పోటీపడిన నాటకం పడమటి గాలి అంటే అతిశయోక్తి కాదన్నారు. అజోవిభో కందాళం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ ఆచార్య కందాళం రామానుజాచార్య స్వామి, సంస్కృతి వ్యవస్థాపకుడు సర్రాజు బాలచందర్ సమాలోచన సదస్సుకు అధ్యక్షత వహించిన డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు, ఎన్‌టిఆర్ పురస్కార గ్రహీత కెఎస్‌టి సాయి, నట దర్శకుడు నాయుడు గోపి, సీనియర్ నటులు తుర్లపాటి రాధాకృష్ణమూర్తి తదితరులు ఘనంగా సత్కరించారు. ఈ పురస్కారం క్రింద 25 వేల రూపాయల నగదు పారితోషికాన్ని, ప్రశంసాపత్రాన్ని అజోవిభో కందాళం ఫౌండేషన్ పాటిబండ్లకు బహూకరించింది. తనకు జరిగిన సత్కారానికి ఆనందరావు స్పందిస్తూ ప్రేక్షకుల చప్పట్లే ఏ కళాకారుడికైనా పట్టుదుప్పట్లుగా ఉంటాయన్నారు. ఇన్నాళ్లుగా, ఇనే్నళ్లుగా నాతో పాటు అనేక కష్టనష్టాలకోర్చి ప్రదర్శనలు విజయవంతం చేసిన ప్రతి కళాకారుడికి ఈ గౌరవం దక్కుతుందన్నారు. నాటకమే నా ఊపిరి అని చేతనైనంత రీతిలో సామాజిక సమస్యలను అంశాలుగా చేసుకుని రచనలు కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రసిద్ద రంగస్థల నటుడు ఉప్పలపాటి సైదులుకు రంగస్థల సేవామూర్తి జీవితకాల సాధనా పురస్కారాన్ని ప్రదానం చేశారు. సభానంతరం శ్రీ కళానికేతన్ హైదరాబాద్ వారు సమర్పించిన మనస్సు చెక్కిన శిల్పం, జనశ్రేణి విజయవాడ వారి గుర్తు తెలియని శవం, మణికంఠ ఆర్ట్స్ కొండెవరం వారి బంధాల బరువెంత సాంఘిక నాటకాలు ఆస్థి, అంతస్థుల కన్నా మానవీయ అనుబంధాలే ముఖ్యమని ప్రస్పుటంగా చాటిచెప్పాయి.

దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలి

* పెదగొట్టిపాడులో మహిళల ధర్నా

ప్రత్తిపాడు, జనవరి 5: మా దళితవాడకు వచ్చి మాపై దాడిచేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, సీనియర్ న్యాయవాది వైకెను వెంటనే మా దళితవాడకు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మండలంలోని పెదగొట్టిపాడు గ్రామం దళితవాడలోని మహిళలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ గురువారం మా దళితవాడకు వస్తున్న వైకెను పోలీసులు అదుపులోకి తీసుకుని, అరెస్ట్ చేసి మా వద్దకు రానీయకుండా అడ్డుకున్నారని, వెంటనే వైకెను మా వద్దకు తీసుకురావాలని, వైకె ఇక్కడకు వచ్చేవరకు ధర్నాను విరమించేది లేదని భీష్మించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే గుంటూరులో ఉన్న వైకెను సంప్రదించి పెదగొట్టిపాడు వచ్చేలా చర్యలు చేపట్టారు. వైకె పెదగొట్టిపాడు దళితవాడకు రావడంతో మహిళలు ధర్నా విరమించారు. సమీపంలోని ఓ పాఠశాలకు వెళ్లగా వైకె వారితో సమావేశమై వారి సమస్యలు విన్న వైకె మీకు ఎలాంటి అన్యాయం జరగనీయమని, మీకు అండగా నిలబడతామని భరోసా ఇచ్చి, మరలా మీ వద్దకు వస్తానని చెప్పి అక్కడి నుండి వెళ్లారు.
ఇరువర్గాలకు రాజీ కుదిరేనా...
పెదగొట్టిపాడు గ్రామంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగిన నేపథ్యంలో గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొనే విధంగా పోలీసు అధికారులు కృషి చేస్తున్నప్పటికీ వారి ప్రయత్నాలు ఫలించడం లేదు. గురువారం ప్రత్తిపాడు పోలీసుస్టేషన్‌లో ఇరు వర్గాలను పిలపించి వారి మధ్య రాజీ కుదర్చాలని పోలీసు అధికారులు సమావేశం ఏర్పాటు చేస్తే ఒక వర్గానికి చెందిన వారు రాగా మరో వర్గం వారు సమావేశానికి హాజరు కాలేదు. దీంతో ఆ సమావేశాన్ని వాయిదా వేశారు. మహిళలు ధర్నా చేపట్టడంతో అప్రమత్తమైన పోలీసులు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎఎస్‌పి సుబ్బారాయుడు, డిఎస్‌పిలు శ్రీరామమూర్తి, సరిత బందోబస్తును పర్యవేక్షించారు.