గుంటూరు

ప్రత్యేక హోదా కోసం కలిసి రండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మే 6: ప్రత్యేకహోదా కోసం ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పోరాడాలనుకుంటే తమతో కలిసి రావాలని తెలుగుదేశం పార్టీ నాయకులకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి సూచించారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా కేంద్రంపై పోరుబాట పట్టాలని సవాల్ విసిరారు. హోదా కోసం జరుగుతున్న పోరాటానికి రాజకీయాలకు అతీతంగా జగన్ నేతృత్వంలోని తమ పార్టీ మొత్తం అండగా నిలుస్తుందన్నారు. శుక్రవారం అరండల్‌పేటలోని తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో అప్పిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల వేళ ప్రత్యేకహోదా ఇస్తామని కేంద్రం, తెస్తామని రాష్ట్రప్రభుత్వం ఉమ్మడిగా ఆంధ్రులను దగా చేశాయని ధ్వజమెత్తారు. స్వార్ధప్రయోజనాల కోసం రాష్ట్ర అభివృద్ధికి తూట్లు పొడిచాయని ఆరోపించారు. ప్రత్యేకహోదా విషయంలో ఆంధ్రులకు న్యాయం చేయాలని రాష్టప్రతిని కోరుతూ శనివారం తాలూకా ఎదుట సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. విలేఖర్ల సమావేశంలో లీగల్‌సెల్ అధ్యక్షుడు పోలూరి వెంకటరెడ్డి పాల్గొన్నారు.