గుంటూరు

రోడ్లపై చెత్త వేస్తే పెనాల్టీ తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కార్పొరేషన్), మే 6: నిబంధనలకు విరుద్ధంగా చెత్తను రోడ్లపై, ఏక్కడపడితే అక్కడ వేస్తే పెనాల్టీ తప్పదని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ నాగలక్ష్మి హెచ్చరించారు. శుక్రవారం ఆమె స్థానిక పాతగుంటూరు ఆంధ్రబ్యాంకు రోడ్డు కల్యాణమండపం వద్ద పారిశుద్ధ్య పనులను తనిఖీ చేశారు. కల్యాణమండపాలు, వ్యాపార, వాణిజ్య సముదాయాల నుండి ఉత్పత్తి అయ్యే చెత్తను కమర్షియల్ వేస్టుకు అప్పగించాలని, చెత్తకుప్పల్లో వేస్తే చర్యలు తప్పవన్నారు. చెత్తను రోడ్లపై వేయకుండా పారిశుద్ధ్య కార్మికులు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తుండాలన్నారు. పారిశుద్ధ్య కార్మికులు తప్పని సరిగా గ్లౌజ్‌లు, ఎఫ్రాన్లు, బూట్లు వేసుకొని పనులు నిర్వహించాలని ఆదేశించారు. అలాగే తమ ప్రాంతానికి మంచినీరు సరిగ్గా రావడం లేదని, వీధి లైట్లు రిపేర్లు చేయడం లేదని, మురుగుకాల్వలు సక్రమంగా లేకపోవడంతో దుర్గంధం వస్తోందని కమిషనర్‌కు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించేందు సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్‌ఈ గోపాలకృష్ణారెడ్డి, ఈఈలు చిన కోటేశ్వరరావు, లక్ష్మయ్య, ఎంహెచ్‌ఓ నాగేశ్వరరావు, బయాలజిస్టు వీర్రాజు, బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.