గుంటూరు

ఈదురు గాలుల బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి, మే 6: రెండు రోజులుగా డెల్టాలో వీస్తున్న ఈదురు గాలులు, కొద్దిపాటి వర్షం, ఉరుములు, మెరుపుల తాకిడికి కృష్ణానది పరివాహక లంక భూముల్లో వేసిన మునగ, అరిటి తోటలు నేలకు ఒరిగాయి. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొని వేసిన పంటలు భారీగా గాలులకు విరిగి నేలకు ఒరగటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురువారం రాత్రి వీచిన బలమైన గాలులకు తోటలు విరిగిపోయాయని, శుక్రవారం ఉదయం పంటలను పరిశీలించేందుకు వెళ్లిన తమకు నిరాశ మిగిలిందని రైతులు వాపోతున్నారు. ఈసంవత్సరం సరైన వర్షాలు లేకపోవటంతో నదిలోని కుంటల్లో ఉన్న నీటిని భారీ విద్యుత్ మోటార్ల ద్వారా నీటిని తోటి మునక, అరటి పంటలకు అందించామని, అకాల వర్షం, బలమైన ఈదురు గాలులకు పంట పడిపోవటంతో కన్నీరే మిగిలిందని రైతులు బోరున విలపిస్తున్నారు. వేసిన పంటలో దాదాపుగా 60 శాతం పంట విరిగిపోయిందని, కోత దశలో ఉన్న పంట ఒక్కసారిగా నాశనం కావటంతో ఆర్థికంగా ఎంతో నష్టం జరిగిందని అన్నదాతలు వాపోతున్నారు. ముఖ్యంగా కొల్లిపర, కొల్లూరు, భట్టిప్రోలు మండల గ్రామాల లంక భూముల్లో వేసిని పంటలకు తీవ్రమైన నష్టం వాటిల్లినట్లు రైతులు చెబుతున్నారు. ఈమేరకు ప్రభుత్వం స్పందించి తనకు న్యాయం చేయాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు.