గుంటూరు

మహిళలకు వైద్య పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, మే 8: మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం నీరుకొండ దళిత శిబిరంలో కొమ్మారెడ్డి సేవాసమితి, కిరణం స్వచ్చంద సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యాన ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో చెవి, ముక్కు, గొంతు, స్ర్తిల వ్యాధులు, ఎముకల వ్యాధులు, కంటి, దంత మొదలైన వ్యాధులకు పరీక్షలు జరిపారు. డాక్టర్ పి ఆదినారాయణ, డాక్టర్ గిరిజ, డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ విజయశేఖర్, డాక్టర్ రాఘవన్, అమర్, బాలవెంకట్రావులతో కూడిన వైద్యబృందం శిబిరంలో సేవలందించింది. మున్సిపల్ కౌన్సిలర్ కొమ్మారెడ్డి సుబ్రహ్మణ్యం, న్యాయవాది మాదిరాజు గోవర్ధనరావు పర్యవేక్షించారు.