గుంటూరు

పెండ్లి కుమారుడైన పానకాలస్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, ఫిబ్రవరి 20: మంగళగిరిలోని శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభ మయ్యాయి. ఉదయానే్న స్వామివారిని, అమ్మవార్లను పంచామృత స్నపనతో మంగళస్నానాలు చేయించి పెండ్లి కుమారునిగా నృసింహస్వామిని, వధువులుగా అమ్మవార్లను అలంకరించారు. ఈ ఉత్సవానికి కైంకర్య పరులుగా పట్టణ పద్మశాలీయ బహూత్తమ సంఘం వారు వ్యవహరించారు. సాయంత్రం పెండ్లి కుమారుని గ్రామోత్సవం పురవీధుల్లో నిర్వహించారు. అఖిల లోక పవిత్ర గోత్రజుడైన స్వామి అందరికీ పవిత్రత కలుగ చేసేందుకు పెండ్లికుమారుడిగా దర్శన మిస్తారని ఆలయ ఉపప్రధాన అర్చకులు దీవి అనంత పద్మనాభాచార్యులు, నల్లూరి శ్రీరామచంద్ర భట్టాచార్యులు తెలిపారు. పెండ్లికుమారుడిగా దర్శన మిచ్చిన నరసింహ స్వామివారిని భక్తులు దర్శించుకుని పరమానంద భరితులయ్యారు. ఆలయ ఇఓ మండెపూడి పానకాలరావు ఏర్పాట్లు పర్యవేక్షించారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

నేడు మంగళగిరి యార్డు పాలకవర్గ అభినందన సభ
మంగళగిరి, ఫిబ్రవరి 20: మంగళగిరి వ్యవసాయ మార్కెట్‌కమిటీ చైర్మన్‌గా వల్లభనేని సాయిప్రసాద్, వైస్‌చైర్మన్‌గా గుత్తికొండ ధనుంజయరావు, పాలకవర్గ సభ్యులు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నూతన పాలకవ ర్గ అభినందన సభ బుధవారం 10 గం టలకు మార్కెట్‌యార్డు ఆవరణలో జరుగుతుందని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ గంజి చిరంజీవి మంగళవారం తెలిపారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, పత్తిపాటి పు ల్లారావు, నక్కా ఆనందబాబు, సిహెచ్ ఆదినారాయణరెడ్డి, ఎంపీలు గల్లా జయదేవ్, రాయపాటి సాంబశివరావు, శ్రీరామ్ మాల్యాద్రి, నిమ్మల కిష్టప్ప, జిల్లా టిడిపి అధ్యక్షులు జీవీ ఆంజనేయులు, శాసన సభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర, మోదుగుల వేణుగోపాలరెడ్డి, ఆలపాటి రాజేంద్రప్రసాద్, రావెల కిషోర్‌బాబు, తెనాలి శ్రావణ్‌కుమార్, యరపతినేని శ్రీనివాసరావు, కొమ్మాలపాటి శ్రీ్ధర్, ఎ సత్యప్రసాద్, గుంటూరు ఎఎంసి చైర్మన్ మన్నవ సుబ్బారావు, నియోజకవర్గ టిడిపి నేతలు పాల్గొంటారని, కార్యకర్తలు అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొనాలని, ఉదయం 9 గంటలకు పార్టీ కార్యాలయం ఎంఎస్‌ఎస్ భవన్ నుంచి ఊరేగింపు ప్రారంభమై పురవీధులగుండా సాగి మార్కెట్‌యార్డు ప్రాంగణానికి చేరుతుందని టిడిపి నాయకులు తెలిపారు.